Nayanthara : ఆ పని చేయడం వల్లే నయనతారకు హీరోయిన్ గా ఛాన్సులు వస్తున్నాయా… మామూలు తెలివి కాదుగా?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా గత రెండు దశాబ్దాలుగా వరుస సినిమాలలో నటిస్తూ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నయనతార( Nayanthara ) ఒకరు.

ఈమె ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాల కాలం పూర్తి అవుతున్నప్పటికీ ఇంకా హీరోయిన్గా అవకాశాలు అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

నయనతారతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఎంతోమంది హీరోయిన్లు ఇప్పటికే ఇండస్ట్రీకి దూరమయ్యారు కానీ నయనతార మాత్రం ఇప్పటికి హీరోయిన్గా అవకాశాలు అందుకోవటం విశేషం.

"""/"/ ఇక ఇన్ని రోజులపాటు సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నయనతార ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.

తాగా ఈమె అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా( Jawan Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా ద్వారా నయనతార బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయమయ్యారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నయనతారకు బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుస్తుంది.

"""/"/ ఇక ఈమెతో పాటు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారందరూ కూడా ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకొని చేతిలో ఒక అవకాశం కూడా లేకుండా ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కానీ నయనతారకు మాత్రం పెళ్లయి ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ కూడా వరుసగా సినిమా అవకాశాలు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇక నయనతారకు ఇప్పటికీ ఇలా సినిమా అవకాశాలు రావడానికి గల కారణం ఏంటి అని కూడా ఆరా తీస్తున్నారు.

మరి నయనతారకు ఇప్పటికి సినిమా అవకాశాలు రావడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే కేవలం సినిమాల పట్ల నయన తార చూపించేటటువంటి ఆసక్తి ప్రేమ ఆ సినిమాకు ఈమె చేసే న్యాయమే కారణం.

"""/"/ నయనతార ఇలాంటి పాత్రలలోనే నటించాలి అన్న రూల్స్ ఏవి పెట్టుకోదు తనకు కథ నచ్చితే ఎలాంటి పాత్రలలోనైనా నటిస్తుంది.

ముఖ్యంగా ఈమె రా ఏజెంట్ పాత్రలలో కూడా నటిస్తూ ఉంటారు.ఇక నయనతార నటించే సినిమాలన్నింటిలో కూడా ఈమె ఏదో ఒక ప్రభుత్వ అధికారిని పాత్రలో నటిస్తూ ఉంటారు.

ఇలా ఈమె పాత్రకు నయనతార 100% న్యాయం చేయడమే కాకుండా, ఆ పాత్రకు అనుగుణంగా తనని తాను మార్చుకొని పాత్రలో లీనమై నటిస్తారని చెప్పాలి.

అందుకే ఇతర హీరోయిన్లకు ఇవ్వాల్సిన అవకాశాలు కూడా నయనతారకే వస్తున్నాయని ఇదే ఈమెను ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా నిలబెట్టిందని చెప్పాలి.

ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే డైరెక్టర్ విగ్నేష్ శివన్ ( Vignesh Shivan ) అనే వ్యక్తితో దాదాపు ఏడు సంవత్సరాల పాటు సహజీవనం చేసినటువంటి నయనతార గత ఏడాది తనని వివాహం చేసుకున్నారు.

అయితే గత ఏడాది వీరిద్దరూ కూడా కవల పిల్లలకు సరోగసి ద్వారా తల్లిదండ్రులుగా మారారు.

ఇలా ఒకవైపు పిల్లల బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపున నయనతార సినిమాలపరంగా బిజీ అయ్యారు.

నేను ఏ పరిస్థితి లో ఉన్న ఆ ముగ్గురు ఫోన్ లిఫ్ట్ చేస్తారు : కమెడియన్ సుధాకర్