గుర్తు పెట్టుకో.. వడ్డీతో సహా తిరిగొస్తుంది.. వైరల్ అవుతున్న నయన్ సంచలన పోస్ట్!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన నయనతార( Nayanthara ) ధనుష్( Dhanush ) కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సంచలన పోస్ట్ చేశారు.
అబద్దాలతో పక్కవారి జీవితాన్ని నాశనం చేస్తే దానిని మీరొక అప్పుగా భావించండి.ఏదో ఒకరోజు మీకు వడ్డీతో సహా తిరిగొస్తుందని గుర్తు పెట్టుకోండి అని నయనతార పేర్కొన్నారు.
నయన్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్( Nayanthara: Beyond The Fairy Tale ) ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
నయనతార విఘ్నేష్ శివన్ తో( Vignesh Shivan ) ఏ విధంగా ప్రేమలో పడ్డారో ఇందులో ప్రధానంగా చూపించారు.
నయన్ విఘ్నేష్ కాంబోలో తెరకెక్కిన తొలి సినిమా నేనూ రౌడీనే( Nenu Rowdy Ne ) కాగా ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు, పాటలను డాక్యుమెంటరీ కోసం వినియోగించుకోవాలని నయనతార, విఘ్నేష్ శివన్ భావించారు.
అయితే అందుకు ధనుష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం గమనార్హం. """/" /
ట్రైలర్ లో నేనూ రౌడీనే సినిమాకు సంబంధించి మూడు సెకన్ల క్లిప్ ను వాడుకున్న నేపథ్యంలో అందుకు పరిహారంగా 10 కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తూ ధనుష్ లీగల్ నోటీసులను పంపించడం జరిగింది.
అయితే ధనుష్ ఈ విధంగా చేయడంపై నయన్ సీరియస్ అయ్యారు.ధనుష్ తీరును తప్పుబడుతూ ఆమె మూడు పేజీల బహిరంగ లేఖను రిలీజ్ చేశారు.
"""/" /
కాంట్రవర్సీకి కారణమైన సీన్స్ ను అలాగే ఉంచడం గమనార్హం.
ధనుష్ తాజాగా హైకోర్టులో దావా దాఖలు చేసిన నేపథ్యంలో నయన్ ఈ పోస్ట్ పెట్టారని తెలుస్తోంది.
నయన్ తరపు న్యాయవాది ఈ వివాదం గురించి మాట్లాడుతూ డాక్యుమెంటరీలో ఉపయోగించిన విజువల్స్ సినిమాలోవి కావని చెప్పారు.
అవి బీటీఎస్ కు సంబంధించినవని పేర్కొన్నారు.అవి వ్యక్తిగత లైబ్రరీలో భాగమని కాబట్టి అది ఉల్లంఘనల కిందికి రాదని చెప్పుకొచ్చారు.
ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాల్సి ఉంది.
వేపతో వావ్ అనిపించే బ్యూటీ బెనిఫిట్స్.. డోంట్ మిస్!