నయనతార స్టాఫ్ కోసమే అన్ని లక్షల ఖర్చా.. నిర్మాతలు భరించలేరుగా?

సౌత్ ఇండియాలో ప్రస్తుతం నంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు నయనతార పేరు సమాధానంగా వినిపిస్తోంది.

వయస్సు పెరుగుతున్నా నయనతారకు సినిమా ఆఫర్లు తగ్గడం లేదు సరికదా అంతకంతకూ పెరుగుతున్నాయి.

తెలుగుతో పాటు అన్ని భాషల్లో నయనతార వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం నయనతార రెమ్యునరేషన్ 7 కోట్ల రూపాయలుగా ఉంది.

కొన్ని నెలల క్రితం వరకు నయనతార 5 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకున్నారు.

అయితే పెళ్లి తర్వాత నయనతార తన పారితోషికాన్ని అమాంతం పెంచేశారు.నయనతార రెమ్యునరేషన్ ను పెంచడంతో నిర్మాతలు ఆమెను సినిమాలలోకి తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

మరోవైపు రోజుకు లక్ష రూపాయల చొప్పున టీమ్ కోసం ఖర్చులు భరించాలని ఆమె చెప్పినట్టు సమాచారం అందుతోంది.

నయనతార ఎన్ని రోజులు షూట్ లో పాల్గొంటే అన్ని లక్షల రూపాయలు స్టాఫ్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది.

"""/"/ అదే సమయంలో షూటింగ్ ఇతర ప్రాంతాలలో జరిగితే ఆమె స్టాఫ్ కోసం కూడా ఫ్లయిట్ టికెట్లను బుకింగ్ చేయడంతో పాటు ఫుడ్ బిల్లులు, హోటల్ రూమ్ బిల్లులు అదనమని తెలుస్తోంది.

తెలుగులో ఒక సీనియర్ హీరోకు జోడీగా నయనతారను సంప్రదించగా ఆమె ఈ రేంజ్ లో డిమాండ్ చేసిందని సమాచారం అందుతోంది.

"""/"/ ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు సక్సెస్ సాధించడం కష్టమవుతోందని కామెంట్లు వినిపిస్తుండగా ఇలాంటి సమయంలో నయనతార నిర్మాతలపై భారం మరింత పెరిగేలా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడు నయనతార చేతిలో ఆఫర్లు ఉన్నా భవిష్యత్తులో ఆమెకు కొత్త ఆఫర్లు రావడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నయనతార తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

నా తల్లి చనిపోతే అలాంటి పోస్టులు చేశారు… దయచేసి అలా చేయొద్దు: రేణు దేశాయ్