నయన్ సినిమాలకు దూరమవుతుందా.. వాస్తవం ఏంటంటే..!

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార సినిమాలకు గుడ్ బై చెప్పనుందంటూ వార్తలు వస్తున్నాయి.

కొన్నాళ్లుగా ఈ వార్తలు హాట్ న్యూస్ గా మారగా లేటెస్ట్ గా దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చింది.

తమిళ, తెలుగు భాషల్లోనే కాదు సౌత్ అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న నయనతార సడెన్ గా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఫిక్స్ అయ్యిందట.

ప్రస్తుతం ఆమె చేస్తున్న జవాన్ సినిమా పూర్తి కాగానే ఇక సినిమాలకు బై చెప్పాలని చూస్తుందట.

అట్లీ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్ సినిమా వస్తుంది.ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

"""/" / ఈ సినిమాతో నయన్ బాలీవుడ్ లో తన లక్ టెస్ట్ చేసుకుంటుంది.

అయితే పెళ్లి, పిల్లలతో పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్న ఆమె ఇక మీదట సినిమాలకు గుడ్ బై చెప్పాలని అనుకుంటుందట.

పిల్లల ఆలనా పాలన చూసుకునేందుకు నయనతార సినిమాలకు బ్రేక్ ఇస్తుందట.అయితే ఈ బ్రేక్ పర్మినెంట్ గా ఇస్తుందా లేక తాత్కాలికంగానా అన్నది తెలియాల్సి ఉంది.

నయనతార నటించడం ఆపేస్తే మాత్రం ఆమె ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

సౌత్ లో ఏ హీరోయిన్ తీసుకోని రెమ్యునరేషన్ తో స్టార్ హీరోలకు సైతం పోటీ ఇస్తుంది నయనతార.

ఢిల్లీ-ఆగ్రా రైలులో డచ్ మహిళను వేధించిన కామాంధుడు.. ఇతనికి సిగ్గు లేదా?