విఘ్నేష్ కు గుర్తింపు రావడానికి నయన్ మాజీ ప్రియుడే కారణమా.. ఏమైందంటే?

నయనతార విఘ్నేష్ శివన్ ల పెళ్లి మహాబలిపురంలో గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే.

కొన్నిరోజుల క్రితం వరకు ప్రేమికులైన నయన్ విఘ్నేష్ మూడుముళ్ల బంధం ద్వారా ఒక్కటయ్యారు.

ఈ వివాహ వేడుకకు కోలీవుడ్ సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.గత ఏడు సంవత్సరాల నుంచి నయన్, విఘ్నేష్ ప్రేమలో ఉన్నారు.

విఘ్నేష్ కంటే నయనతార వయస్సులో ఏడాది పెద్ద కావడం గమనార్హం.పెళ్లి తర్వాత కూడా నయనతార సినిమాలలో కొనసాగనున్నారు.

గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమలో పడిన నయనతార వేర్వేరు కారణాల వల్ల ఆ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోలేకపోయారు.

అయితే విఘ్నేష్ శివన్ కు దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు రావడానికి శింబు కారణం కావడం గమనార్హం.

హీరో శింబు, విఘ్నేష్ శివన్ ఒకే స్కూల్ లో చదువుకున్నారు.విఘ్నేష్ తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ నచ్చడంతో శింబు తన సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని విఘ్నేష్ శివన్ కు ఇచ్చారు.

శింబు విఘ్నేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన పొడా పొడి యావరేజ్ టాక్ ను తెచ్చుకుంది.

ఆ తర్వాత విఘ్నేష్ శివన్ రెండో సినిమాగా నయనతారతో నేనూ రౌడీనే అనే సినిమాను తెరకెక్కించారు.

విఘ్నేష్ శివన్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకోవడానికి ఒక విధంగా శింబు కారణమని చెప్పవచ్చు.

శింబు, ప్రభుదేవాలకు నయనతార వివాహానికి సంబంధించి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. """/"/ ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

భారీ మొత్తంలో డబ్బును కూడబెట్టుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో నయన్ విఘ్నేష్ ఆలస్యంగా పెళ్లి చేసుకున్నారు.

నయనతార ఆస్తుల విలువ 170 కోట్ల రూపాయలు అని సమాచారం.నయనతార తెలుగులో గాడ్ ఫాదర్ మూవీలో నటిస్తున్నారు.

వీడియో: రోగుల తలలపై అసభ్యకర డ్యాన్సులా.. టిక్‌టాక్‌ కోసం అమెరికన్‌ వర్కర్ దారుణం..