మళ్లీ ఇద్దరు లేడీ సూపర్ స్టార్స్‌ కలిసి నటించబోతున్నారా?

మళ్లీ ఇద్దరు లేడీ సూపర్ స్టార్స్‌ కలిసి నటించబోతున్నారా?

లేడీ సూపర్ స్టార్ నయనతార ( Nayantara ) పెళ్లి తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

మళ్లీ ఇద్దరు లేడీ సూపర్ స్టార్స్‌ కలిసి నటించబోతున్నారా?

బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌( Sharukh Khan ) హీరోగా నటిస్తున్న జవాన్ చిత్రంలో నయనతార కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

మళ్లీ ఇద్దరు లేడీ సూపర్ స్టార్స్‌ కలిసి నటించబోతున్నారా?

అంతే కాకుండా ఒక సౌత్ పాన్ ఇండియా సినిమాలో కూడా నయనతార నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇవన్నీ కాకుండా నయనతార మరో చిత్రానికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నయనతార ప్రముఖ దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పిందట.

ఆ కథ లో మరో హీరోయిన్ ఉండాల్సి ఉందట.అందుకు గాను సమంత ను( Samantha ) ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది.

"""/" / గతంలో ఇద్దరు కలిసి ఒక సినిమా లో నటించారు.విఘ్నేశ్ శివన్‌ దర్శకత్వం లో రూపొందిన ఆ సినిమా లో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

అంతే కాకుండా ఇద్దరూ కూడా పోటీ పడి నటించడంతో ఆ సినిమా సూపర్ హిట్ అయింది.

తెలుగులో కూడా మంచి స్పందన లభించింది.ఇద్దరి కాంబినేషన్ కి మంచి రెస్పాన్స్ రావడంతో మరోసారి ఇద్దరు కలిసిన నటించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

గతంలో వీరి సినిమాకు వచ్చిన రెస్పాన్స్ నేపధ్యంలో ఈ సినిమా కూడా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

"""/" / ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే సంవత్సరం చివర్లో వీరిద్దరి కాంబినేషన్ సినిమా సెట్స్ పైకి ఎక్కే అవకాశం ఉంది.

మరో వైపు సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా ఉంది.అంతే కాకుండా హిందీ లో సినిమాలు మరియు సిరీస్ లు చేస్తూ బిజీ గా గడుపుతోంది.

ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్స్ చాలా బిజీగా ఉన్నారు.ఇలాంటి సమయంలో కలిసిన నటించడం అనేది కచ్చితంగా గొప్ప విషయం.

ఇది ఒక మంచి మల్టీస్టారర్ మూవీ అవ్వబోతుంది అంటూ తమిళ మీడియా లో కథనాలు వస్తున్నాయి.

తెలుగు ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి.

త్రివిక్రమ్ కొడుకుకి సందీప్ రెడ్డి వంగ అంటే ఇష్టమా..? ఎందుకంటే..?

త్రివిక్రమ్ కొడుకుకి సందీప్ రెడ్డి వంగ అంటే ఇష్టమా..? ఎందుకంటే..?