నీది అయితే ఒకలా ? పక్కన వాళ్ళది అయితే ఇంకోలా ?

సినిమా లో ఎంత పెద్ద స్టార్ ఉన్న, స్టార్ డైరెక్టర్ ఉన్న, నిర్మాత అయినా తనకు అవసరం లేదు.

ఆమె వచ్చిందా సినిమా తీసిందా.వెళ్లిపోయిందా ? ఎలాంటి ప్రమోషన్ కి, టీజర్స్ కి, ఇంటర్వూస్ కి హీరోయిన్ కనిపించదు.

ఆలా సౌత్ ఇండియా మొత్తం ఆమె నడిపిస్తుంది.ఆమె మరెవరో కాదు .

నయన తార.ఎంత పెద్ద హీరో అయినా కూడా ఆమె మాత్రం సినిమా కాల్షీట్ అయినా తర్వాత ఎక్కడ కనిపించదు.

ప్రి రిలీజ్ ఈవెంట్ కి కూడా అస్సలు రాదు.సౌత్ లోనే ఆమె ఇప్పుడు అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ అయినా కూడా యూట్యూబ్ కి వెబ్ సైట్స్ కి ఆమె అప్పోయింట్మెంట్ దొరకదు.

చివరకు చిరంజీవి సైరా, గాడ్ ఫాదర్ కి కూడా ఆమె ఎక్కడ కనిపించలేదు.

సినిమాకు డబ్బు తీసుకోవడం, నటించి వెళ్లిపోవడం.ఇది మాత్రమే ఆమె వర్కింగ్ స్టైల్.

ఇక వయసు ఎంత పెరిగిన ఆమెకు ఇంకా గిరాకి పెరుగుతుంది.సీన్ కట్ చేస్తే తన భర్త విగ్నేష్ శివన్ నిర్మిస్తున్న సినిమాలో నయన్ లీడ్ రోల్ లో నటిస్తుంది.

ఇప్పటి వరకు ఆమె పెట్టుకున్న నిబంధలు నీళ్లు వదిలి ఇప్పుడు సినిమా పై క్రేజ్ పెంచేందుకు ఆమె వరస ఇంటర్వూస్ ఇస్తుంది.

ఇక దొరికిందే అవకాశం అన్నట్టు గా మీడియా ఛానెల్స్ కూడా ఆమెను అన్ని రకాలుగా ప్రశ్నలతో వాయించేస్తున్నారు.

ఇక ఇప్పుడు అర్ధం అయ్యి ఉంటుంది నయన్ కి. """/"/ ఇంటర్వూస్ సినిమాకు ఎంత అవసరమో, అలాగే ఆమె ఇంతకు ముందు ప్రమోషన్స్ చేయలేదు కాబట్టి వారిని ఆమె ఎంత ఇబ్బంది పెట్టిందో కూడా ఆమె అర్ధం చేసుకోవచ్చు.

సినిమా లో నటిస్తే మాత్రమే గొప్ప కాదు.ఆ సినిమాను ముందుకు తీసుకెళ్లడం కూడా చాల అవసరం.

ఇప్పుడు ఆమె నటిస్తున్న సినిమా తన భర్త ది కాబట్టి అన్ని రకాలుగా ప్రమోషన్స్ చాల కష్ట పడి చేస్తుంది.

అయితే ఆమెను ఈ విషయం లో చాల మంది విమర్శిస్తున్నారు.మిగతా వాళ్ళ డబ్బు అయితే ఆమెకు ఏమాత్రం పట్టదు కానీ ఆమె సొంత డబ్బు పెట్టింది కాబట్టి ఏమైనా చేస్తుందా అని అంటున్నారు.

ఇక ఆమె నటిస్తున్న సినిమా పేరు కనెక్ట్.ఈ చిత్రానికి నయన్ మాత్రమే ప్రాణం.

ఆమె వల్లే సినిమాకు క్రేజ్ ఏర్పడింది.

వైరల్ వీడియో: ఆరేళ్ల బాలికపై వీధి కుక్కల దాడి.. చిన్నారి కాలు పట్టుకుని మరీ