నవోదయ సీటు సాధించిన బావుసాయిపేట విద్యార్థిని. -ఘనంగా సన్మానించిన గ్రామస్తులు

226– నవోదయ( Navodaya )కు ఎంపికైన సాయినిత్యను సన్మానిస్తున్న సర్పంచ్ తదితరులురాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన మాలోత్ సాయినిత్య విద్యార్థిని జవహార్ నవోదయకు ఎంపికైంది.

గ్రామానికి చెందిన విద్యార్థిని స్థానిక కేరళ ఇంగ్లీష్ మీడియం( English Medium )'పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ ఆరో తరగతిలో ప్రవేశం కోసం నవోదయ ఎంట్రన్స్ పరీక్ష రాసింది.

గురువారం ఫలితాలు‘రావడంతో ఎంపికైనట్లు తెలిసింది.సర్పంచ్ కెంద గంగాధర్,ఉపసర్పంచ్ చొక్కాల దేవరాజు, ఎంపీటీసీ యాస్మిన్ పాషా,కరస్పాండెంట్ గంగిశెట్టి మునీందర్ తదితరులు ఘనంగా సన్మానం చేశారు.