నవోదయ ప్రవేశ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తు గడువు పెంపు: ప్రిన్సిపాల్ ఆర్. నాగభూషణం

నవోదయ ప్రవేశ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తు గడువు పెంపు: ప్రిన్సిపాల్ ఆర్. నాగభూషణం

నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం చలకుర్తి క్యాంపులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో ప్రవేశం కొరకు ప్రవేశ ఎంపిక పరీక్షకు హాజరయ్యేందుకు ఆన్ లైన్లో దరఖాస్తు గడువును పరిపాలనా కారణాల రీత్యా ఈ నెల 23 వ,తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ ఆర్.

నవోదయ ప్రవేశ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తు గడువు పెంపు: ప్రిన్సిపాల్ ఆర్. నాగభూషణం

నాగభూషణం తెలిపారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ,లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

నవోదయ ప్రవేశ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తు గడువు పెంపు: ప్రిన్సిపాల్ ఆర్. నాగభూషణం

నవోదయలో ఆరవ తరగతి ప్రవేశం కోరేటటువంటి అభ్యర్థులు ప్రస్తుతం ఐదో తరగతి (2024-25)ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే చదువుతూ వుండి, అభ్యర్థుల తల్లిదండ్రుల నివాసము ఉమ్మడి నల్గొండ జిల్లాలోనిదై ఉండాలన్నారు.

ఆసక్తిగల అభ్యర్థులు ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా లేదా మొబైల్ ఫోన్ ద్వారా ఆన్ లైన్ లో ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకు గాను ప్రధానోపాధ్యాయుడి సంతకంతో కూడిన ధ్రువపత్రం,ఫోటోతో దరఖాస్తును ఆన్లైన్లోసమర్పించవచ్చని,ఈనెల 23వ,తేదీ చివరి తేదీ వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తల్లితండ్రులు, ఉపాధ్యాయులు త్వరపడి తమ తమ పిల్లలను ప్రోత్సహించి అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

నన్ను అత్తగా సెలెక్ట్ చేసుకున్నందుకు థాంక్యూ.. మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్ వైరల్!

నన్ను అత్తగా సెలెక్ట్ చేసుకున్నందుకు థాంక్యూ.. మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్ వైరల్!