ఆ డైరెక్టర్ తో సినిమా చేసేది లేదంటూ హీరో నవీన్ పోలిశెట్టి కామెంట్స్..ఇబ్బందుల్లో పడ్డ నిర్మాతలు!

ప్రస్తుతం ఇండస్ట్రీ లో అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్న హీరో నవీన్ పోలిశెట్టి.( Naveen Polishetty ) అంతకు ముందు యాంకర్ గా చేస్తూ, చిన్న చిన్న పాత్రల ద్వారా ఆడియన్స్ ని పలకరించిన నవీన్ పోలిశెట్టి 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' చిత్రం తో తొలిసారి హీరో గా ఎంట్రీ ఇచ్చాడు.

ఈ చిత్రం లో చూసినప్పుడే అందరికి అనిపించింది.ఎవరీ కుర్రాడు చాలా అందం గా ఉన్నాడు, కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంది , ఎమోషన్స్ కూడా ఓవర్ డ్రామా లేకుండా చాలా చక్కగా సహజంగా చేసాడు అని అందరూ అనుకున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన 'జాతి రత్నాలు'( Jathi Ratnalu ) చిత్రం కమర్షియల్ గా వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది.

సుమారుగా 38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి నవీన్ పోలిశెట్టి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.

ఈ చిత్రం తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఆయన 'మిస్ శెట్టి.

మిస్టర్ పోలిశెట్టి'( Miss Shetty Mr Polishetty ) సినిమాతో మన ముందుకు వచ్చాడు.

ఈ సినిమా కాస్త స్లో గా ఉంది అనే టాక్ వచ్చినప్పటికీ కూడా నవీన్ పోలిశెట్టి సెకండ్ హాఫ్ లో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు.

దీనితో యావరేజి అవ్వాల్సిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి, నవీన్ పోలిశెట్టి కెరీర్ లో హ్యాట్రిక్ ని పూర్తి చేసింది.

"""/" / ఇక ఈ చిత్రం తర్వాత నుండి నవీన్ పోలిశెట్టి స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో ఆచి తూచి అడుగులు వెయ్యబోతున్నాడు.

అందులో భాగంగా గతం లో ఆయన కళ్యాణ్ శంకర్ తో ప్రారంభించిన 'అనగనగా ఒక రాజు'( Anaganaga Oka Raju ) అనే సినిమాని హోల్డ్ లో పెట్టాడు.

అందుకు కారణం ఇప్పటి వరకు తీసిన ఈ సినిమా ఔట్పుట్ నవీన్ పోలిశెట్టి కి పెద్దగా నచ్చలేదు అనే.

అందుకే ఈ చిత్రం నుండి కళ్యాణ్ శంకర్( Kalyan Shankar ) నుండి తీసేసి అనుదీప్ ని( Anudeep ) పెట్టాల్సిందిగా నవీన్ పోలిశెట్టి నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నాడట.

"""/" / ఈ సినిమాని 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.

అనుదీప్ గతం లో నవీన్ తో జాతి రత్నాలు వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

ఈ చిత్రానికి కూడా అతనే కావాలని అడుగుతున్నాడట.కళ్యాణ్ శంకర్ రీసెంట్ గా 'మ్యాడ్' ( Mad Movie ) అనే సినిమాకి దర్శకత్వం వహించి సూపర్ హిట్ ని అందుకున్నాడు.

ఆ సినిమాని మంచిగానే తీసాడు కానీ, 'అనగనగ ఒక రాజు' చిత్రాన్ని మాత్రం సరిగా తియ్యలేదట.

అందుకే నవీన్ పోలిశెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

పుష్ప 2 ప్రమోషన్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా… ఇది మామూలు క్రేజ్ కాదు?