స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న నవీన్ పోలిశెట్టి..

ఇప్పటివరకు చాలామంది హీరోలు తెలుగు సినిమా స్థాయిని దాటి ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక నవీన్ పోలిశెట్టి ( Naveen Polishetty )లాంటి యంగ్ హీరో మాత్రం తెలుగు సినిమాలనే చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ప్రస్తుతం ఆయన మార్కెట్ కూడా భారీగా పెరుగుతుంది.సినిమా సినిమాకి మధ్య గ్యాప్ అయితే ఎక్కువగా తీసుకుంటున్నప్పటికి ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ఫుల్ సినిమా గా నిలిచిపోవాలనే ఉద్దేశ్యంతోనే అలాంటి ఒక గ్యాప్ ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

"""/" / మరి ఏది ఏమైనా కూడా ఈయన చేస్తున్న సినిమాలు మంచి విజయాన్ని సాధించాలంటే మాత్రం తన నటనలో వేరియేషన్స్ ని కూడా చూపించాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతీ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఆయన చేయబోయే సినిమాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఆయన రాబోయే రోజుల్లో కూడా మంచి హీరోగా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

మరి ఆయన చేసిన సినిమాలు ఇప్పుడు చేయబోతున్న సినిమాలు కూడా మరొక ఎత్తుగా మారబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

"""/" / ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం శేఖర్ కమ్ముల( Shekhar Kammula ) ఆయనతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటికే శేఖర్ కమ్ముల ధనుష్ తో కుబేర ( Kubera )అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా అయిపోయిన వెంటనే నవీన్ పోలిశెట్టి తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

నవీన్ పోలిశెట్టి ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా శేఖర్ కమ్ముల గారే కావడం విశేషం.

మరి ఇప్పుడు ఆయనతోనే సినిమాలు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక ఇది ఏమైనా కూడా నవీన్ పోలిశెట్టి చాలా తక్కువ సమయం లోనే ఆయనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడం విశేషం.

చిన్నోడితో సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్న పెద్దోడు… సంక్రాంతికి వస్తున్నాం టీమ్ తో మహేష్!