అనుష్కతో సినిమా చేయడానికి కారణం అదే.. నవీన్ పోలిశెట్టి కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి ( Naveen Polishetty )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

నవీన్ పోలిశెట్టి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేసి సినిమా జాతి రత్నాలు.

ఈ సినిమాతో ఒక్కసారిగా భారీగా పాపులారిటీని సంపాదించుకున్నారు నవీన్.ముఖ్యంగా ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి కామెడీ అదుర్స్ అని చెప్పవచ్చు.

అయితే ఈ సినిమా కంటే ముందు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా కూడా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. """/" / వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంతో పాటు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న నవీన్ పోలిశెట్టి చాలా గ్యాప్ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిసినిమా( Miss Shetty Mr Polishetty Movie )తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ మూవీ సెప్టెంబరు 7న రిలీజ్ కానుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రేమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు నవీన్.

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ.నేను ఓ ఇంజినీర్.

చేతిలో ఉన్న ఉద్యోగం పక్కనబెట్టి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను.బాగా డబ్బులొచ్చే పని వదిలేసి వచ్చానని అమ్మనాన్న చాలా కోప్పడ్డారు.

"""/" / ఏజెంట్ ఆత్రేయ సినిమాకి ముందు పదేళ్లపాటు ఇంటిపేరు పాడుచేస్తున్నానని తిట్టారు.

నా వల్ల మావాళ్లు ఎంతో ఇబ్బంది పడ్డారు.ఇప్పుడు టైటిల్‌ లోనే ఇంటిపేరు ఉండటం చూసి నాన్న హ్యాపీగా ఫీలయ్యారు.

జాతిరత్నాలు ఈ రేంజులో అలరిస్తుందని మేం అస్సలు ఊహించలేదు.ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి ఒత్తిడికి లోనయ్యాను.

అలాంటి సమయంలో ఒక మహిళా అభిమానిని కలిశాను.ఆమె కన్నీళ్లు పెట్టుకోవడంతో నేను ఏడ్చేశాను.

ఇలా నన్ను ఆదరిస్తున్న వాళ్లకి మంచి ఎంటర్‌టైన్ మెంట్ ఇవ్వాలని ఫిక్సయ్యాను.అలా ఎన్నో కథలు విని.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిఓకే చేశాను.అనుష్కతో కలిసి వర్క్ చేయడం సరదాగా అనిపించింది అని నవీన్ పోలిశెట్టి చెప్పుకొచ్చాడు.

ఇంటర్వ్యూలో భాగంగా నవీన్ పోలిశెట్టి చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి… అందరూ షాక్!