నరేష్ పవిత్ర ప్రేమాయణంపై కొడుకు షాకింగ్ కామెంట్స్.. పవిత్ర క్యారెక్టర్ గురించి చెబుతూ?
TeluguStop.com
నరేష్ పవిత్ర లోకేశ్( Naresh ) ప్రేమాయణం గురించి ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
నరేష్, పవిత్ర లోకేశ్ వయస్సులో చాలా పెద్దవారు కావడంతో వీళ్లిద్దరి ప్రేమాయణం గురించి ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఈ జోడీకి పాజిటివ్ గా సపోర్ట్ దక్కడం లేదు.
నరేష్ పవిత్ర జంటగా మళ్లీ పెళ్లి సినిమా తెరకెక్కగా ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయింది.
థియేటర్లలో ఫ్లాప్ ఫలితాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.
అయితే నరేష్ పవిత్ర ప్రేమాయణం గురించి నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ( Naveen Vijay Krishna ) తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మా కుటుంబంలో ఎవరికి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తారని నవీన్ అన్నారు.
ఎవరిపై ఆధారపడరని మొదటినుంచి అదే జరుగుతోందని నవీన్ చెప్పుకొచ్చారు. """/" /
ఈ క్రమంలో కొన్ని తప్పులు జరిగాయని అయితే ఎవరి గురించి నేను చెడుగా ఫీలవ్వలేదని నవీన్ కామెంట్లు చేశారు.
ప్రజలు మా కుటుంబం గురించి ఏది పడితే అది వాగినా నేను పట్టించుకోలేదని ఆయన అన్నారు.
జనాలకు నచ్చినట్టు జీవించలేం కదా అని నవీన్ కామెంట్లు చేశారు.నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని నేను గౌరవిస్తానని నవీన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
"""/" /
నాన్న సంతోషంగా ఉన్నాడా? లేదా అనేది మాత్రమే మాకు కావాల్సింది అని నవీన్ చెప్పుకొచ్చారు.
పవిత్ర లోకేశ్( Pavitra Lokesh ) నాకు ఎప్పటినుంచో తెలుసని ఆమె చాలా మంచి అని నవీన్ కామెంట్లు చేశారు.
పవిత్రను నేను పవిత్రగారు అని పిలుస్తానని నవీన్ పేర్కొన్నారు.నవీన్ విజయ్ కృష్ణ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.