తగ్గేదేలే రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?
TeluguStop.com
డైరెక్టర్ శ్రీనివాస రాజు దర్శకత్వంలో రూపొందిన సినిమా తగ్గేదేలే.ఈ సినిమాలో నవీన్ చంద్ర, అనన్య రాజ్, దివ్య పిళ్లై, రాజా రవీంద్ర, నాగ బాబు, రవి శంకర్, అయ్యప్ప పి శర్మ, పూజా గాంధీ, మక్రంద్ దేశ్ పాండే, కోటేశ్వర్ రావు, నైనా గంగూలీ, రవి కాలే తదితరులు నటించారు.
ఇక ఈ సినిమాను భద్రా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ్ కుమార్ పాండే, పీవీ సుబ్బారావు నిర్మించారు.
చరణ్ అర్జున్ మ్యూజిక్ అందించాడు.ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
H3 Class=subheader-styleకథ: /h3pకథ విషయానికి వస్తే.ఇందులో నవీన్ చంద్ర ఈశ్వర్ అనే పాత్రలో కనిపిస్తాడు.
ఈశ్వర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్.ఇక జీవితాన్ని అన్ని రకాలుగా ఆస్వాదించాలని కోరికతో స్వామి (నాగబాబు) నడిపే ప్యారడైజ్ అనే ఆశ్రమానికి వెళ్తాడు.
ఇక ఆశ్రమంలో డ్రగ్స్, అమ్మాయిలతో నిండి ఉంటుంది.చెప్పాలంటే సుఖాలకు అడ్డా అని చెప్పవచ్చు.
అయితే ఆశ్రమంలో లిజీ (అనన్య రాజ్) తో పరిచయం ఏర్పడటంతో ఆ పరిచయం పడకగదిలో శారీరక సంబంధం వరకు దారితీస్తుంది.
అయితే అనుకోకుండా కొన్ని పరిస్థితుల కారణంగా ఈశ్వర్ కు తన మేన మరదలు దేవి (దివ్య) తో పెళ్లి జరుగుతుంది.
ఇక అదే సమయంలో ఈశ్వర్ జీవితంలోకి లిజీ కూడా వస్తుంది.దీంతో ఆయన జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
అంతేకాకుండా ఈశ్వర్ ఇంట్లో లిజీ చనిపోతుంది.ఇంతకు తను ఎలా చనిపోయింది.
ఇంతకు తనని ఎవరు చంపారు.అసలు ఈశ్వర్ ఎవరు అనేది మిగిలిన కథలోనిది.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/11/naveen-chandra-ya-pillai-thaggede-le-movie-review-and-rating-detailss!--jpg "/
H3 Class=subheader-styleనటినటుల నటన:/h3p నటీనటుల విషయానికి వస్తే.నవీన్ చంద్ర ఎప్పటిలాగే తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.
ఇక ఎమోషనల్ పాత్రలో మాత్రం అద్భుతంగా కనిపించాడు.అంతేకాకుండా రొమాంటిక్ సీన్లలో కూడా బాగా రెచ్చిపోయాడు.
ఇక లిజీ పాత్ర ఇంకాస్త బెటర్ గా కొనసాగించి ఉంటే బాగుండు అనిపించేది.
ఇక మిగతా నటినటులంతా తమ పాత్రలకు తగ్గట్టుగా పెర్ఫార్మన్స్ ఇచ్చారు.h3 Class=subheader-styleటెక్నికల్: /h3pటెక్నికల్ పరంగా.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది.సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.
నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకున్నాడు డైరెక్టర్.
H3 Class=subheader-styleవిశ్లేషణ:/h3p ఈ సినిమాను డైరెక్టర్ మూడు రకాల పాయింట్స్ తో తీసుకొచ్చాడు.
అందులో స్వామీజీ ప్యారడైజ్ ఆశ్రమం లిజీ, దండుపాళ్యం బ్యాచ్ కి సంబంధించిన మరో పాయింట్.
ఇక దివ్య, ఈశ్వర్, లిజీ ల మధ్య కొన్ని సన్నివేశాలు రకరకాల ట్విస్టులతో చూపించాడు.
కానీ ఎందుకో దర్శకుడు కథను చూపించే తీరులో వెనుకబడ్డాడు అన్నట్లు అనిపించింది. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/11/naveen-chandra-ya-pillai-thaggede-le-movie-review-and-rating-detailsa!--jpg "/
H3 Class=subheader-styleప్లస్ పాయింట్స్:/h3p నటీనటుల నటన, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎమోషనల్ సన్నివేశాలు.
H3 Class=subheader-styleమైనస్ పాయింట్స్:/h3p కొన్ని కొన్ని సన్నివేశాలు బాగా సాగదీసినట్లు అనిపించింది.కొన్ని సన్నివేశాలు చికాకుగా అనిపించాయి.
H3 Class=subheader-styleబాటమ్ లైన్:/h3p చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా క్రైమ్, మర్డరీ, మిస్టరీలను ఇష్టపడే ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అని చెప్పవచ్చు.
H3 Class=subheader-styleరేటింగ్: 3/5/h3p.