కష్టాల్లో ఉన్నప్పుడు అతనే అన్నం పెట్టాడు: నవీన్ చంద్ర!

కష్టాల్లో ఉన్నప్పుడు అతనే అన్నం పెట్టాడు: నవీన్ చంద్ర!

హీరో, విల‌న్ పాత్ర‌లు వేయ‌డంలో ఆయ‌నకే చెల్లింది.చేస్తే హీరోగానే చేయాల‌నే ఫందా కాకుండా.

కష్టాల్లో ఉన్నప్పుడు అతనే అన్నం పెట్టాడు: నవీన్ చంద్ర!

త‌న న‌ట‌న‌కు మంచి స్కోప్ ఉన్న పాత్ర‌ల్ని చేసేందుకు నేనెప్పుడూ సిద్ధమేనంటారు న‌వీన్ చంద్ర‌.

కష్టాల్లో ఉన్నప్పుడు అతనే అన్నం పెట్టాడు: నవీన్ చంద్ర!

హైద‌రాబాద్ లో పుట్టి.బ‌ళ్లారిలో పెరిగిన ఈ న‌టుడు డ్యాన్స్ మాస్ట‌ర్ గా త‌న కెరియ‌ర్ ను ప్రారంభించారు.

బ‌ళ్లారి , బెంగ‌లూరుల్లో డ్యాన్స్ ఇనిస్టిట్యూట్ లు ఎక్కువ‌గా ఉండేవి.దీంతో సినీమా అవ‌కాశాల కోసం డ్యాన్స్ స్కూల్లో డ్యాన్స్ నేర్చుకొని ఆఫ‌ర్స్ కోసం ఎదురుచూసిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి.

ఇక బ‌ళ్లారిలో ఉంటే లాభం లేద‌నుకొని హైద‌రాబాద్ కు వ‌చ్చారు.అవ‌కాశాల కోసం తిరిగ‌ని స్టూడియో లేదు.

వెళ్ల‌ని షూటింగ్ స్పాట్స్ లేవు.అలా 2005లో సంభ‌వామి యుగేయుగే సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది.

కానీ ఫ‌లితం తారుమారైంది.ఇటు తెలుగుతో పాటు త‌మిళ్ లో చేసిన కొన్ని సినిమాలు విడుద‌ల కూడా కాలేదు.

దీంతో పూర్తి డిప్రెష‌న్ కు గురైన న‌వీన్ చంద్ర‌ను సంభ‌వామి యుగే యుగే ర‌చ‌యిత య‌తిరాజ్ ల‌క్ష్మీ భూపాల్ అండ‌గా నిలిచిన‌ట్లు చెప్పాడు నవీన్ చంద్ర.

ఆఫ‌ర్స్ లేక, చేతిలో డ‌బ్బులు లేని స‌మ‌యంలో ల‌క్ష్మీ భూపాల్ త‌న రూమ్ లో ఉంచుకొని అన్నం పెట్టిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

ఆయ‌న చేసిన సాయానికి కృత‌జ్ఞ‌త అనే ప‌దం చిన్న‌ద‌వుతుంద‌ని.ఆఫ‌ర్స్ లేక ఇబ్బంది ప‌డుతున్న టైమ్ లో ర‌చ‌యిత ల‌క్ష్మీ భూపాల్ వ‌ల్లే అందాల రాక్షిసి సినిమాలో అవ‌కాశం వ‌చ్చిన‌ట్లు తెలిపారు.

"""/"/ 2005లో సంభావామి యుగే యుగే త‌రువాత త‌మిళ్ లో చేసిన సినిమాలు రిలీజ్ కాలేదు.

అలా నాటి నుంచి 2012వ‌ర‌కు ఛాన్స్ ల కోసం ట్రై చేసిన న‌వీన్ చంద్ర‌.

ర‌చ‌యిత ల‌క్ష్మీ భూపాల్ ప్రోత్సాహంతో అందాల రాక్ష‌సి డైర‌క్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడితో మీట‌య్యారు.

పూర్తి డిప్రెష‌న్, మాసిన గ‌డ్డంతో ఉన్నా హ‌ను.గ‌డ్డాన్ని అలాగే ఉంచుకోమ‌ని చెప్పి ఓ సంవత్స‌రం పాటు ఫ్లాట్, ఓ స‌హాయ‌కుడిని ఇచ్చారు.

ఆ త‌రువాత 2013లో అందాల రాక్ష‌సి సినిమా విడుద‌లై అన్నీ వ‌ర్గాల ప్రేక్షకుల్ని అల‌రించింది.

క‌మ‌ర్షియ‌ల్ గా హిట్ కాక‌పోయినా త‌న‌కు వ‌రుస ఆఫ‌ర్ల‌ను తెచ్చిపెట్టిందంటారు న‌వీన్ చంద్ర.

అందాల రాక్షసి సినిమా చూసిన డైర‌క్ట‌ర్ త్రివిక్ర‌మ్.అర‌వింద స‌మేత లో త‌న‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్లు చెప్పారు.

హీరోగా కొన్ని సినిమాలు ఫ‌లితాలు రాక‌పోవ‌డానికి కార‌ణం స‌రైన క‌థ‌లు ఎంచుకోక‌పోవ‌డమేన‌ని అంగీకరించారు ఈ అందాల రాక్ష‌సి హీరో న‌వీన్ చంద్ర.