Navdeep : పెళ్లికి సిద్ధమైన నవదీప్… వెడ్డింగ్ కార్డు అంటూ ట్విస్ట్ ఇచ్చారుగా?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు పొందినటువంటి నవదీప్( Navdeep ) హీరోగా పలు సినిమాలలో నటించడమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.

ఇలా పలు సినిమాలలోను వెబ్ సిరీస్ లలోను నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి నవదీప్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడంతో ఈయనకు తరచు ఎక్కడికి వెళ్లిన తన పెళ్లి( Navdeep Marriage ) గురించే ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి.

ఇలా పెళ్లి ప్రశ్న వచ్చిన ప్రతిసారి ఈయన ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకుంటున్నారు.

"""/" / తాజాగా తన వెడ్డింగ్ కార్డ్( Wedding Card ) అంటూ ఈయన వెడ్డింగ్ కార్డుకి సంబంధించినటువంటి ఫోటోని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు.

అదేంటి నవదీప్ పెళ్లి చేసుకోబోతున్నారా ఎక్కడ బయటకు కూడా ఈ వార్త రావడం లేదే అన్న సందేహాలు ప్రతి ఒక్కరికి కలుగుతున్నాయి కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

ఇటీవల కాలంలో సినిమాలను భారీ స్థాయిలో విభిన్నంగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు అయితే నవదీప్ సైతం తన సినిమాని చాలా విభిన్నంగా ప్రమోట్ చేస్తూ వచ్చారు.

ప్రస్తుతం ఈయన లవ్ మౌళి ( Love Mouli ) అనే సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఆ సినిమా విడుదల తేదీని ఏకంగా ఒక వెడ్డింగ్ కార్డు రూపంలో తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు.

"""/" / లవ్ మౌళి సినిమా రిలీజ్ కి సంబంధించిన కార్డు ఈయన విడుదల చేశారు.

ఒక చెక్క పెట్టెలో కార్డు ఓపెన్ చేసి పెళ్లి కొడుకు స్థానంలో నవదీప్ పేరు పెళ్లి కూతురు స్థానంలో పంఖురి గిద్వానీ పేరు.

ముహూర్తం ప్లేస్‌లో సినిమా రిలీజ్ డేట్‌ని.చూపిస్తూ.

పెళ్లి శుభలేఖ ఎలాగైతే ఉంటుందో.సేమ్ టు సేమ్ అలాగే.

తన సినిమా రిలీజ్ లేఖను పెళ్లి శుభలేఖ తరహాలో సినిమా విడుదల తేదీని కూడా ఈయన అనౌన్స్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఇది చూసిన అభిమానులు చూసిన వెంటనే పెళ్లి కార్డు అనుకున్నాను కదా అన్న ఇలా ట్విస్ట్ లు ఇచ్చారేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఆ జాబితాలో సైతం నంబర్ వన్ స్టార్ హీరోగా ప్రభాస్.. దేశంలోనే నంబర్ వన్ గా నిలిచారుగా!