నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!

జాతకాలను నమ్మే వారంతా ఎప్పుడో ఒకసారి నవగ్రహారాధన( Navagraharadhana ) తప్పకుండా చేయాలని పండితులు చెబుతున్నారు.

ఆ దేవాలయాల సందర్శన ప్రదక్షిణలు చేస్తే స్నానం చేయాలా, కాళ్లు కడుక్కోవాలా అనే విషయాలు రకరకాలుగా చెప్తారు.

ముఖ్యంగా నవగ్రహ దర్శనం( Navagraha Darshanam ) తర్వాత కాళ్లు కడుక్కోవాలా వద్దా, కడుక్కుంటే ఎందుకు కడుక్కోవాలి అనే విషయాలపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి.

అయితే నవగ్రహాల పూజ( Navagraha Pooja ) తర్వాత కాళ్లు కడుక్కోవాలి అనేది ఏ శాస్త్రంలోనూ లేదు.

నవగ్రహాల పూజ చేసి అక్కడ కాళ్లు కడుక్కుంటే దోషాలన్నీ పోతాయని చాలామంది ప్రజలు చెబుతూ ఉంటారు.

నవగ్రహాలకు బయట నుంచి తగలకుండా ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి కాళ్ళు కడుక్కోవాల్సిన పనిలేదు.

అయితే శని త్రయోదశి ఇతర గ్రహ బాధలు పోవడానికి రకరకాల పద్ధతులలో పూజలు చేస్తారు.

ఆయా సందర్భాలలో స్నానం చేయాల్సి ఉంటుంది.మీ జాతకంలో ఎలాంటి దోషాలకు పూజలు చేయించుకున్నారో అక్కడున్న పండితులకు తెలుస్తుంది.

కాబట్టి వారు చెప్పిన నియమాలను పాటించడం ఎంతో మంచిది.శని త్రయోదశికి తైలాభిషేకం, ఉప్పు, నల్ల నువ్వులు ఇతర పదార్థాలతో తీవ్రమైన శని దోషాలకు పరిహారం చేసుకున్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలని చెబుతూ ఉంటారు.

"""/" / చాలామంది నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక చేతిలో నవగ్రహాల ను తాకి ప్రదక్షిణ చేస్తుంటారు.

పొరపాటున కూడా ఈ విధంగా నవగ్రహాలను తాగి ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.

నవగ్రహాల ప్రదక్షిణలు చేయడానికి నవగ్రహాల మండపంలోకి వెళ్లే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి చంద్రుడి నుంచి కుడి వైపుగా తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి.

ఇలా తొమ్మిది ప్రదక్షిణలను పూర్తి చేసిన తర్వాత బుద్ధుడి నుంచి రాహు, కేతువులను సందర్శిస్తూ మరో రెండు ప్రదక్షిణలు చేయాలి.

"""/" / ఈ విధంగా నవగ్రహాల చుట్టూ మొత్తం 11 ప్రదక్షిణలు చేయాలి.

అలాగే నవగ్రహాల్లో ఉన్న 9 గ్రహాల పేర్లు స్మరిస్తూ మండపంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు నవగ్రహాలకు వీపు చూపకుండా వెనక్కు నడుస్తూ బయటకు రావాలి.

ఇలా చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్లు కడుక్కోకుండా ఇంటి లోపలికి ప్రవేశించడం వల్ల మనం చేసిన పూజ ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

నాగచైతన్య తండేల్ ను సంక్రాంతి రేసులో నిలపడం వెనుక అసలు రీజన్ ఇదేనా?