నవదీప్… ఓ విఫల ఆర్టిస్ట్.. పూర్తిస్థాయి నష్ట జాతకుడు.. జస్ట్ ప్లే బాయ్ అంతే..!

2004లో జై ( Jai )అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు నవదీప్( Navdeep ).

20 ఏళ్లుగా హీరో అవ్వడానికి సక్సెస్ కొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నప్పటికీ ఎందుకు అస్సలు సాధ్యం కావడం లేదు.

తాజాగా లవ్ మౌలి( Love Mouli ) అనే పేరుతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న అది దారుణంగా డిజాస్టర్ ఫలితాన్ని చూపిస్తుంది.

చాలా థియేటర్స్ లో షోలు క్యాన్సిల్ అవుతున్నాయి.మరి 10% ఆక్యూపెన్సి తో కొన్ని షోలు అయితే నడుస్తున్నాయి.

మరి ఈ 38 ఏళ్ల హైదరాబాద్ ఎందుకు హీరోగా సక్సెస్ అవ్వలేకపోతున్నాడు అర్థం కావడం లేదు.

నిజానికి బోర్డు అంత టాలెంట్ ఉంది నవదీప్ కి.కానీ కేవలం ప్లే బాయ్ గానే ఇండస్ట్రీలో మిగిలిపోతున్నాడు.

"""/" / నవదీప్ పేరు చెప్పగానే అందరికీ గుర్తించేది కేవలం చందమామ సినిమా( Chandamama Movie ) మాత్రమే.

ఈ 20 ఏళ్లలో చందమామ తర్వాత మరో గుర్తుంచుకోదగ్గ సినిమాల్లో అతడు కనిపించలేదు.

కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ధ్రువ, ఆపరేషన్ వాలెంటైన్, ఆర్య వంటి సినిమాల్లో కనిపించాడు కానీ అవేమీ అతడికి పెద్ద యూజ్ అవ్వలేదు.

ఇంకా హీరోగా ఏదో సాధించాలనే తపనతో కనిపిస్తున్నప్పటికీ సరైన స్క్రిప్ట్ లేకపోవడం లవ్ మౌలి విషయంలో పెద్ద ఓటమి అని చెప్పుకోవచ్చు ఇందులో రానా కూడా గెస్ట్ రోల్ లో ఉన్నప్పటికీ పరువు పోగొట్టుకున్నాడు గాని సినిమాకి ఏమాత్రం ఉపయోగపడలేకపోయాడు.

"""/" / నిజానికి నవదీప్ మంచి అందగాడు మంచి నటుడు, అలాగే హోస్ట్ గా కూడా అనేక షోలకు పని చేస్తున్నాడు, బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోస్ లో కూడా పాల్గొన్నాడు.

అయినప్పటికీ కూడా తనకు రావాల్సిన గుర్తింపు రావట్లేదు.కానీ తరదైన రోజు తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నిరూపించుకోగలడు.

సో ఇప్పటికైనా మంచి కథలను ఒప్పుకొని దానికి తగ్గ దర్శకులతో సినిమాలు తీస్తే బాగుంటుంది.

లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కంటిన్యూ అయితే ఇంకా బెటర్.ఇలా ప్రయోగాలు చేసి జనాల మీద రుద్ది చిరాకు పుట్టించడం వద్దు బాసు.

సొంత అక్కకే పోటీగా నిలిచిన జయమాలిని.. జ్యోతిలక్ష్మి లాస్ట్ డేస్ ఎలా గడిచాయంటే..??