రిమూవర్‌తోనే కాదు ఇలా కూడా మేక‌ప్‌ను తొలిగించ‌వ‌చ్చు.. తెలుసా?

నేటి కాలంలో ఏది లేకున్నా ఉంటున్నారు.కానీ, మేక‌ప్ లేకుండా మాత్రం ఉండ‌లేక‌పోతున్నారు.

ముఖ్యంగా అమ్మాయిల్లో చాలా మంది మేక‌ప్ వేసుకోకుండే.ఇంట్లో నుంచి కాలు కూడా బ‌య‌ట పెట్ట‌డం లేదు.

సహజ అందానికి కాస్త మేకప్ టచ్ ఇస్తే.మ‌రింత అందంగా క‌నిస్తారు.

అందుకే అమ్మాయిలు మేక‌ప్ వేసుకునేందుకు ఎక్కువ‌గా ఇంట్ర‌స్ట్ చూపిస్తుంటారు.అయితే అందంగా క‌నిపించాలంటే మేక‌ప్ వేసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో.

మ‌న చ‌ర్మం ఆరోగంగా ఉండాలంటే వేసుకున్న మేక‌ప్‌ను తొలిగించ‌డం కూడా అంతే అవ‌స‌రం.

"""/"/ ఇక సాధార‌ణంగా చాలా మంది మేక‌ప్‌ను తొలిగించేందుకు మేక‌ప్ రిమూవ‌ర్‌ను ఉప‌యోగిస్తుంటారు.

అయితే రిమూవ‌ర్‌తోనే కాకుండా న్యాచుర‌ల్‌గా కూడా మేక‌ప్‌ను తొలిగించుకోవ‌చ్చు.మ‌రి అదెలాగో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్‌లో వెన్న తీసిన పాలు తీసుకుని.అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మంలో దూదిని ముంచి.మేక‌ప్‌ను సులువుగా తొలిగించుకోచ్చు.

అలాగే రోజ్‌ వాట‌ర్‌తో కూడా మేక‌ప్‌ను రిమూవ్ చేయొచ్చు.అయితే ఇంట్లో త‌యారు చేసుకున్న న్యాచుర‌ల్ రోజ్ వాట‌ర్‌తో మేక‌ప్‌ను తొలిగించుకుంటే.

చ‌ర్మానికి ఎంతో మంచిద‌ని అంటున్న బ్యూటీష‌న్లు.ఇక ఒక బౌల్‌లో ఒక‌టిన్న‌ర్ టీ స్పూన్ల బేకింగ్ సోడా, కొద్దిగా తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని యూజ్ చేసి కూడా మేక‌ప్‌ను తొలిగించుకోవ‌చ్చు.ఇక ఒక బౌల్‌లో కొబ్బ‌రి నూనె మ‌రియు బాదం రెండిటిని స‌మానంగా తీసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని దూది సాయంతో అప్లై చేసి కూడా మేక‌ప్‌ను సులువుగా రిమూవ్ చేయ‌వ‌చ్చు.

అయితే చాలా మంది చేసే పొర‌పాటు.మేక‌ప్‌ను తొలిగించి ఫేస్ వాష్ చేసుకోకుండానే వ‌దిలేస్తుంటారు.

ఫ‌లితంగా, ప‌లు కెమిక‌ల్స్ ముఖంపైనే ఉండి చ‌ర్మాన్ని డ్యామేజ్ చేసేస్తాయి.అందువ‌ల్ల‌, మేక‌ప్ రిమూవ్ చేసిన త‌ర్వాత ఖ‌చ్చితంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

విశాఖ స్టీల్‎ప్లాంట్ భూములపై ఏపీ హైకోర్టులో విచారణ