మలబద్ధకం మదన పెడుతుందా.. వర్రీ వద్దు ఇలా వదిలించుకోండి!

మలబద్ధకం( Constipation ).కోట్లాది మందిని సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.

అయితే చాలా మంది ఈ సమస్య గురించి బయటకు చెప్పుకోరు.అయితే మలబద్ధకం అనుకున్నంత చిన్న సమస్య ఏమి కాదు.

బాడీకి సరిపడా నీటిని అందించకపోవడం, ఆహారపు అలవాట్లు, ఫైబర్ కొరత, బిజీ లైఫ్ స్టైల్ త‌దిత‌ర కార‌ణాల‌ వల్ల మలబద్ధకం సమస్య మదన పెడుతూ ఉంటుంది.

దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఆకలి మందగిస్తుంది.బలహీనత, అలసట, కడుపునొప్పి, వాంతులు ఇలా మ‌రెన్నో సమస్యలు తలెత్తుతాయి.

అందుకే కొందరు మలబద్ధకం నుంచి బయటపడేందుకు మందులు వాడుతుంటారు.అయితే ఈ సమస్యను సహజంగా కూడా నివారించుకోవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు గ్రేట్ గా సహాయపడతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం మలబద్ధకం స‌మ‌స్య‌ను నివారించే ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

ఎండు ద్రాక్ష( Raisins ).మలబద్ధకం సమస్యకు చెక్ పెట్ట‌డానికి అద్భుతంగా హెల్ప్ చేస్తుంది.

నైట్ నిద్రించే ముందు ఎనిమిది నుంచి పది ఎండుద్రాక్ష వాటర్ లో నానబెట్టాలి.

మ‌రుసటి రోజు ఉదయాన్నే నానబెట్టుకున్న ఎండు ద్రాక్షను వాటర్ తో సహా తీసుకోవాలి.

ఇలా చేస్తే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.దీంతో మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.

"""/" / ఆయిల్ మసాజ్ తోనూ మలబద్ధకం సమస్యను నివారించుకోవచ్చు.అవును ఒక బౌల్ లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె( Coconut Oil ), వన్ టేబుల్ స్పూన్ వాము వేసి ఒక నిమిషం పాటు హీట్ చేయాలి.

ఇలా హిట్ చేసిన ఆయిల్ గోరువెచ్చగా మారిన తర్వాత పొత్తికడుపు పై అప్లై చేసి రెండు చేతులతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

నైట్ నిద్రించేముందు కనీసం ప‌ది నిమిషాల పాటు ఈ విధంగా మసాజ్ చేసుకుంటే మలబద్ధకం ప‌రార్ అవుతుంది.

"""/" / చియా సీడ్స్ మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడతాయి.రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ కలిపి తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

అలాగే మలబద్ధకంతో బాధ పడేవారు రోజుకు ఒక ఉడికించిన చిలకడదుంపను తీసుకునేందుకు ప్రయత్నించండి.

చిలకడ దుంపల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.ఇది జీర్ణ వ్యవస్థను చురుగ్గా మారుస్తుంది.

మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

రోజు నైట్ ఈ మిరాకిల్ క్రీమ్ ను వాడితే కళ్ళ చుట్టూ నల్లటి వల‌యాలు పరార్!