ఈ ఆకుతో..గింజలుతో మోకాళ్లనెప్పులు మాయం..

వయసు మీదపడుతున్నకొద్దీ ఎక్కువగా బాధించే సమస్య మోకాళ్ళ నెప్పులు.ఈ సమస్య ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది.

ముఖ్యంగా మహిళలలో ఎక్కువగా కనిపిస్తుంది.ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనపడుతొంది.

ఆకుకూరలతో మోకాళ్ళ నెప్పులకి పరిష్కారం ఉంటుంది అని వైద్యులు చెప్తున్నారు.ఆరోగ్యనిపుణుల అంచనా ప్రకారం మనదేశంలో మరొక మరొక ఐదేళ్ల తరువాత మోకాళ్ళ నెప్పులతో భాదపడే వారి సంఖ్య సుమారు ఆరుకోట్లకి చేరుతుందని చెప్తున్నారు.

ఈ నెప్పుల నివారణకోసం చాలా మంది ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు.వీటిని వాడటం వలన శరీరంలో మిగతా అవయవాలు పాడయ్యే అవకాశం ఉంది.

అందుకే సహజసిద్ధమైన మందులకి వాడటం ఉత్తమం అని చెప్తున్నారు వైద్యులు.ఈ నెప్పుల నివారణకు ఆకుకూరల్లో అన్నిటికంటే కూడా బచ్చలికూర తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇందులో భాగంగా వారానికి ఓసారి బచ్చలికూర తినాలని వారు సలహా ఇస్తున్నారు.ఇందులోని ఐరన్.

మోకాలి నొప్పులను దూరం చేస్తుంది.మిగిలిన ఆకుకూరలతో పోలిస్తే.

ఈ రోగాన్ని దూరం చేసే శక్తి బచ్చలి కూరలో ఎక్కువగా వుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మొక్కజొన్నలు, సన్ ఫ్లవర్, సోయాబీన్ ఆయిల్ వంటివి డైట్‌లో చేర్చుకోవాలి.ఇవి శరీర బరువును తగ్గిస్తాయి.

తద్వారా మోకాళ్ల నొప్పులను నయం చేస్తాయి.అంతేకాదు ఆయుర్వేదంలో ఉపయోగించే మహాబీర విత్తనాలు తీసుకుని ముందురోజు రాత్రి నీటిలో నానపెట్టి మరునాడు ఉదయం వాటిని సేవిస్తే నొప్పులు పోతాయి.

పక్కా ప్రణాళికతో సీఎం జగన్ పై దాడి..: సజ్జల