అతిసారంతో ఆగ‌మాగం అవుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోస‌మే!

ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మంది అతిసారం(నీళ్ల విరేచ‌నాలు లేదా డయేరియా) స‌మ‌స్య‌తో ఆగ‌మాగం అవుతుంటారు.

డ‌యేరియా బారిన ప‌డిన‌ప్పుడు తీవ్ర‌మైన క‌డుపు నొప్పి, పొత్తిక‌డుపు ఉబ్బ‌డం, జ్వ‌రం, వికారం, వాంతులు, గొంతు మరియు నాలుక ఎండిపోవడం, నీర‌సం వంటి లక్ష‌ణాలు మ‌రింత ఇబ్బంది పెడుతుంటాయి.

అలాగే డ‌యేరియా వ‌ల్ల డీహైడ్రేష‌న్ బారిన ప‌డే అవ‌కాశాలు కూడా చాలా అధికంగా ఉంటాయి.

అందుకే వీలైనంత త్వ‌ర‌గా ఈ స‌మ‌స్య‌ను వ‌దిలించుకోవ‌డానికి మందులు వాడుతుంటారు.అయితే కొన్ని గృహ చిట్కాల ద్వారా కూడా అతిసారం స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఆ చిట్కాలు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.పెరుగు, జీల‌క‌ర్ర‌.

ఈ రెండిటి కాంబినేష‌న్ డ‌యేరియాను స‌మ‌ర్థ‌వంతంగా నివారిస్తుంది.అర స్పూన్ జీల‌క‌ర్ర‌ను తీసుకుని వేయించి పొడి చేసుకోవాలి.

ఈ పొడిని ఒక క‌ప్పు పెరుగులో క‌లిపి ఉద‌యం, సాయంత్రం తీసుకుంటే.నీళ్ల విరేచ‌నాల‌కు అడ్డు క‌ట్ట ప‌డుతుంది.

అలాగే నారింజ పండు తొక్కల టీ కూడా అతిసారం స‌మ‌స్య‌ను త‌గ్గించ‌గ‌ల‌దు.ఒక నారింజ పండును తీసుకుని వాట‌ర్‌లో శుభ్రంగా క‌డిగి తొక్క‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఇలా స‌ప‌రేట్ చేసుకున్న తొక్క‌ను చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఆపై గిన్నెలో గ్లాస్ వాట‌ర్‌, నారింజ పండు తొక్క‌లు, చికెడు దాల్చిన చెక్క పొడి వేసి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు హీట్ చేసుకుంటే టీ సిద్ధ‌మైన‌ట్టే.

ఈ టీలో రుచికి స‌రిప‌డా తేనె క‌లిపి రోజుకు ఒక‌సారి తాగితే డ‌యేరియా నుంచి విముక్తి ల‌భిస్తుంది.

"""/"/ ఇక మెంతి నీరు కూడా ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌గ‌ల‌దు.రాత్రి నిద్రించే ముందు ఒక స్పూన్ మెంతుల‌ను గ్లాస్ నీటిలో వేసి నాన‌బెట్టుకోవాలి.

ఉద‌యాన్నే మెంతుల‌తో స‌హా ఆ నీటిని సేవిస్తే.అతిసారం స‌మ‌స్య నుంచి తొంద‌ర‌గా బ‌య‌ట‌ప‌డొచ్చు.

బెంగళూరు కంటే శాన్ ఫ్రాన్సిస్కో బెటర్ అంటున్న మహిళ.. ఎందుకో తెలిస్తే..?