ఇలా ఆవిరి పడితే తలనొప్పి ఇట్టే పోతుందట..ఎప్పుడైనా ట్రై చేశారా?
TeluguStop.com
తలనొప్పి.దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో దీన్ని ఫేష్ చేసే ఉంటారు.
ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన, పోషకాల కొరత ఇలా రకరకాల కారణాల వల్ల తలి నొప్పి వేధిస్తూ ఉంటుంది.
కారణం ఏదేమైనప్పటికీ.తల నొప్పి రాగానే చాలా మంది చేసే పొరపాటు పెయిన్ కిల్లర్స్‌ను వేసుకోవడం.
ఇవి తలనొప్పి నుంచి తక్షణమే ఉపశమనాన్ని అందించినప్పటికీ.భవిష్యత్తులో మాత్రం అనేక దీర్ఘకాలిక సమస్యలను తెచ్చిపెడతాయి.
అందుకే పెయిన్ కిల్లర్స్‌ను వేసుకోవడం కంటే న్యాచురల్ పద్ధతుల్లోనే తల నొప్పిని నివారించుకోవడం మేలంటారు.
అయితే ఆవిరి పట్టడం ద్వారా కూడా తలనొప్పిని నివారించుకోవచ్చని మీకు తెలుసా? అవును, ఇప్పుడు చెప్పే విధంగా ఆవిరి పడితే తలనొప్పి చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.
మరి లేటెందుకు తల నొప్పిని వదిలించుకునేందుకు ఎలా ఆవిరి పట్టాలో చూసేయండి.అల్లం.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో జబ్బులనూ నివారిస్తుంది.
అలాగే తల నొప్పిని సైతం తగ్గిస్తుంది.అల్లంతో ఆవిరి పడితే ఎటువంటి తల నొప్పి అయినా మటుమాయం అయిపోతుంది.
అందు కోసం, ఒక బౌల్‌లో నీటితో తీసుకుని.అందులో అల్లం పేస్ట్ లేదా అల్లం పొడి వేసుకుని బాగా హిట్ చేయాలి.
ఇప్పుడు ఈ వాటర్‌తో నాలుగైదు నిమిషాల పాటు ఆవిరి పట్టాలి.ఇది కాస్త ఘాటుగా ఉన్నప్పటికీ.
తల నొప్పి నుంచి మాత్రం క్షణాల్లోనే ఉపశమనాన్ని అందిస్తుంది.మరియు జలుబు, దగ్గు వంటి సమస్యలనూ తగ్గిస్తుంది.
"""/" /</
ఇక పుదీనా ఆకులతో ఆవిరి పట్టినా తల నొప్పి మటాష్ అయిపోతుంది.
అందు కోసం, ఒక గిన్నెలో నీటిలో తీసుకుని, అందులో గుప్పెడు పుదీనా ఆకులు వేసి బాగా హీట్ చేయాలి.
అపై ఈ నీటితో కాసుపే ఆవిరి పడితే.తల నొప్పి ఇట్టే పోబుతుంది.
అంతేకాదు, పుదీనా ఆకులతో ఆవిరి పట్టడం వల్ల మైండ్ రిలాక్స్ అయిపోతుంది.మనసు ప్రశాంతగా మారుతుంది.
ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు సైతం దూరం అవుతాయి.
నాని, విజయ్ దేవరకొండ పాన్ ఇండియాలో తెలుగు సినిమా స్థాయిని పెంచుతారా..?