నాని ఆగేదేలే.. దసరా షురూ..!

నాచురల్ స్టార్ నాని రీసెంట్ గా అంటే సుందరానికీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.

సినిమాలో నాని సరసన నజ్రియా హీరోయిన్ గా నటించింది.శ్యామ్ సింగ రాయ్ హిట్ కొట్టగా అంటే సుందరానికీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచింది.

ఇక ఇదిలాఉంటే నాని అంటే సుందరానికీ సినిమా తర్వాత దసరా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్ తో అలరిస్తున్నాడు.

అంటే సుందరానికీ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకోవాలని అనుకున్నా దసరా సినిమాని ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో నాని ఆ సినిమా తదుపరి షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు.

నెక్స్ట్ వీక్ దసరా షూటింగ్ మరోసారి మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది.ఒక సినిమా పూర్తి కాగానే మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే నాని ఆ విషయంలో అస్సలు ఆగేదేలే అన్నట్టుగా ఉన్నాడు.

నాని దసరా మూవీలో ఫీమేల్ లీడ్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.

కరెంట్ ఉండదని అసత్య ప్రచారం..: డిప్యూటీ సీఎం భట్టి