ఆ సినిమాలోని సీన్స్ లో నా యాక్టింగ్ నచ్చలేదు.. నాని షాకింగ్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
న్యాచురల్ స్టార్ నాని( Natural Star Nani ) తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు.
నాని పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.హిట్3 సినిమాతో మరికొన్ని రోజుల్లో నాని ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తాజాగా ఎవడే సుబ్రహ్మణ్యం( Yevade Subramanyam Movie ) రీ యూనియన్ జరగగా ఈ రీ యూనియన్ గురించి కూడా నాని మాట్లాడారు.
విజయ్, నేను, నాగ్ అశ్విన్ ( Nag Ashwin )ఇప్పటికీ టచ్ లో ఉన్నామని వీలున్నప్పుడు మాట్లాడుకుంటామని సినిమాలు విడుదలైన సమయంలో సందేశాలు పంపించుకుంటామని చెప్పుకొచ్చారు.
పది సంవత్సరాల తర్వాత టీమ్ అంతా ఒకే చోట కలవడం సంతోషంగా అనిపించిందని నాని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మా సినిమా కోసం వర్క్ చేసిన వాళ్లు పెద్దవాళ్లు అయ్యారని ఆయన తెలిపారు.
రీ యూనియన్ లో సినిమా ప్రదర్శించారని సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసిన సమయంలో నా యాక్టింగ్ బాలేదని అనిపించిందని ఇంకొంచెం బెటర్ గా చేస్తే బాగుండేదనే ఫీలింగ్ వచ్చిందని నాని పేర్కొన్నారు.
శైలేష్ కొలనుకు నాతో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉందని కాకపోతే మొదట్లో అతడు ఎప్పుడూ నాతో ఈ విషయాన్ని చెప్పలేదని నాని అన్నారు.
"""/" /
హిట్3 సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో హిట్3 సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది.