స్టార్స్ ను మించిన ప్రయోగాత్మక పాత్రలో నాని.. ది ప్యారడైజ్ గ్లింప్స్ వేరే లెవెల్!

న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ (Nani ,Srikanth Odela Combination)లో తెరకెక్కిన దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

ది ప్యారడైజ్ గ్లింప్స్ (The Paradise Glimpse)తాజాగా విడుదల కాగా ఈ గ్లింప్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ గ్లింప్స్ లో నాని లుక్ న భూతో న భవిష్యత్ అనేలా ఉంది.

స్టార్స్ ను మించిన ప్రయోగాత్మక పాత్రలో నాని ఈ సినిమాలో కనిపించనున్నారు.న్యాచురల్ స్టాఅర్ నాని(Natural Star Nani) ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డారని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది.

ఈ గ్లింప్స్ కోసమే దాదాపుగా కోటి రూపాయలు ఖర్చు అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

"""/" / ఆ లుక్స్ ఏంటి? ఆ కాన్సెప్ట్ ఏంటి? అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

నాని ఫ్యామిలీ హీరో నుంచి వయొలెంట్ హీరోగామారిన కథ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గ్లింప్స్ లో బూతులు కూడా ఉండటంపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.పాన్ ఇండియా స్థాయిలో నాని బాక్సాఫీస్ ను షేక్ చేసేలా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

"""/" / ది ప్యారడైజ్ మూవీ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

2026 సంవత్సరం మార్చి నెల 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఈ ఏడాది నాని కేవలం హిట్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.నాని పాన్ ఇండియా ఇమేజ్ ను పెంచుకునే దిశగా అడుగులు వేయనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నాని కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.