ఆమెలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది… హీరోయిన్ పై నాని పొగడ్తల వర్షం?

నాచురల్ స్టార్ నాని ( Nani ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ ఏడాది దసరా( Dasara ) సినిమా ద్వారా సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నటువంటి నాని త్వరలోనే హాయ్ నాన్న( Hai Naana ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ విడుదల నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా నాని హీరోయిన్ మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

"""/" / సీతారామం సినిమా( Sitaramam ) ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

అయితే తనకు ఇతర సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక తండ్రి కూతురి నేపథ్యంలో తెరకెక్కిన హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇక ఈ సినిమాలో ఈమె నటన చూసిన తర్వాత నాని ఆమె నటన పట్ల చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"""/" / ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.మృణాల్ లో ఏదో తెలియని ఒక ఎక్స్ పాయింట్ ఉంటుంది.

స్క్రీన్ మీద తను మ్యాజిక్ చేస్తుంది.కెమెరా వెనక ఆమె ఎలా ఉన్నా కెమెరా ముందు మాత్రం ఆమె చెలరేగిపోతుందని నాని ఈ సందర్భంగా నటి మృణాల్ ఠాకూర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇక ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశాలు కూడా ఉన్నాయనే సంగతి తాజాగా విడుదల చేసిన టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.

అయితే ఈ సన్నివేశాలపై నాని స్పందిస్తూ సినిమాకు ఇది అవసరం కాబట్టే పెట్టామని లిప్ లాక్ సన్నివేశాల గురించి కామెంట్స్ చేశారు.

ఇక దసరా సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నటువంటి నానికి హాయ్ నాన్న సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

తెలుగులో ఉన్న ఈ ఆరుగురి హీరోల్లో ఎవరు నెంబర్ వన్ హీరో ఎవరో తెలుసా..?