కేసీఆర్ ని ఇమిటేట్ చేసిన న్యాచురల్ స్టార్ నాని..ప్రెస్ మీట్ అదుర్స్!

'దసరా' లాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన చిత్రం 'హాయ్ నాన్న'.

శౌరవ్ అనే నూతన దర్శకుడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 7 వ తారీఖున విడుదల కాబోతుంది.

దీనికి సంబంధించిన ప్రొమోషన్స్ ఇప్పటి నుండే ప్రారంభించాడు నాని.అందరి లాగా కాకుండా చాలా డిఫరెంట్ స్టైల్ లో ఆయన ప్రొమోషన్స్ చేసుకుంటున్నాడు.

ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ( Telangana Election )హీట్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నాడు.

ఈమధ్యనే మీడియా ముందుకు వచ్చి 'హాయ్ నాన్న ' పార్టీ మ్యానిఫెస్టో ని విడుదల చేసి విన్నూతన రీతిలో పబ్లిసిటీ ప్రారంభించిన నాని, ఇప్పుడు రీసెంట్ గా ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి కేసీఆర్ స్టైల్ లో మాట్లాడడం హైలైట్ గా నిల్చింది.

నాని లో ఈ మిమిక్రీ టాలెంట్ కూడా ఉందా అని ఈ వీడియో చూసినప్పుడే అర్థం అయ్యింది.

"""/" / ప్రెస్ మీట్స్ లో కేసీఆర్ మాట తీరు ఎలా ఉంటుందో మనమంతా ఎన్నో ఏళ్ళ నుండి చూస్తూనే ఉన్నాం.

సరిగ్గా ఆయన లాగానే ఎలాంటి అతి మరియు కాంట్రవర్సి లేకుండా అద్భుతంగా ఆయన్ని ఇమిటేట్ చేస్తూ నాని చేసిన ఈ వీడియో కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ప్రొమోషన్స్ కోసం కొంతమంది హీరోలు లాగ ఏది పడితే అది చెయ్యకుండా, ఎలాంటి దిగజారుడు కార్యక్రమాలకు పాల్పడకుండా, చాలా చక్కగా నాని తన స్టైల్ లో కుమ్మేస్తున్నాడు.

ముఖ్యంగా మీడియా రిపోర్టర్స్ తల తిక్క ప్రశ్నలు అడిగినప్పుడు కేసీఆర్( Cm Kcr ) ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందో మనమంతా చూస్తూనే ఉన్నాం.

సరిగ్గా నాని కూడా అదే ఇమిటేట్ చేసాడు.ఈ వీడియో ని మీరు కూడా క్రింద చూసి ఎంజాయ్ చెయ్యండి.

ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

"""/" / రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ మరియు పాటలు ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఎదో డిఫరెంట్ కాన్సెప్ట్ ని మళ్ళీ ఈ సినిమా తో ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది.

దసరా చిత్రం తో నాని( Nani ) రేంజ్ బాగా పెరిగింది.మళ్ళీ ఆ స్థాయి ప్రాజెక్ట్ తో మన ముందుకు వస్తాడు అనుకుంటే ఆయన మామూలు రేంజ్ ప్రాజెక్ట్ తోనే వస్తున్నదని అభిమానుల్లో కాస్త నిరాశ ఉంది.

కానీ ఈ చిత్రం తనకి పాన్ ఇండియన్ మార్కెట్ ని తెచ్చిపెడుతుందని నాని బలమైన నమ్మకం తో ఉన్నాడు.

మరి ఆ నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.

బ్రెజిల్ జాతీయ చిహ్నం ఈ కుక్కలే.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!