కొడుకు స్టార్ హీరో అయినప్పటికీ నాని తల్లి ఇప్పటికీ అలా చేస్తారట.. ఎంతో గ్రేట్ అంటూ?
TeluguStop.com
న్యాచురల్ స్టార్ నాని అష్టాచమ్మా సినిమా( Ashta Chamma Movie ) నుంచి దసరా సినిమా వరకు కెరీర్ పరంగా ఎన్నో విజయాలను అందుకున్నారు.
న్యాచురల్ స్టార్ నాని ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.తక్కువ పారితోషికంతో కెరీర్ ను మొదలుపెట్టిన నాని ప్రస్తుతం 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్( Remuneration ) తీసుకునే రేంజ్ కు ఎదిగారు.
కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్న అతికొద్ది మంది హీరోలలో నాని ఒకరు. """/" /
కథ అద్భుతంగా ఉంటే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి సైతం నాని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
అయితే నాని( Nani ) కుటుంబం గురించి కానీ నాని తల్లి గురించి కానీ అభిమానులకు ఎక్కువగా తెలియదు.
న్యాచురల్ స్టార్ నాని తల్లి పేరు విజయలక్ష్మి( Vijayalakshmi )కాగా స్టార్ హీరో తల్లి అయినా ఆమె సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు.
నాని తల్లి ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నా ఆర్టీసీ బస్ లో వెళ్లడానికి ఇష్టపడతారట.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/09/‹-nani-Ashta-Chamma-Movie-Remuneration-tollywood-social-media!--jpg" /
ఈ విధంగా నాని తల్లి విజయలక్ష్మి వెళ్లడానికి కూడా ప్రత్యేకమైన కారణం ఉందట.
తను కారులో వెళ్లాలంటే కారు, డ్రైవర్, వాహనానికి పెట్రోల్ అవసరమని ఒక వ్యక్తి బయటకు వెళ్లాలంటే ఇంత ఎఫర్ట్ అవసరం లేదని భావించి ఆమె బస్సులో వెళ్లడానికి ఇష్టపడతారట.
ఒకానొక సందర్భంలో నాని ఒక ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా స్టార్ హీరో తల్లి, తండ్రి అంటే లగ్జరీ కార్లలో తిరుగుతూ రిచ్ గా కనిపించడానికి ఇష్టపడతారు.
అయితే నాని తల్లి మాత్రం ఇతర సెలబ్రిటీల కుటుంబ సభ్యులకు భిన్నంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటున్నారు.
న్యాచురల్ స్టార్ నాని తల్లి నిజంగా గ్రేట్ అని సోషల్ మీడియా( Social Media ) వేదికగా నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.