చ‌ర్మ ఛాయ పెర‌గాలా..అయితే ఈ స్క్రబ్స్ ట్రై చేయాల్సిందే!

సాధార‌ణంగా ఒక్కో సారి చ‌ర్మ ఛాయ త‌గ్గుతూ ఉంటుంది.మృత క‌ణాలు పేరుకుపోవ‌డం, ఎండ‌ల ప్ర‌భావం, ఆహార‌పు అల‌వాట్లు, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, కాస్మోటిక్స్ అతిగా వాడ‌టం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చర్మ ఛాయ త‌గ్గుతుంది.

దాంతో తెగ హైరానా ప‌డిపోతూ మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ర‌క‌ర‌కాల క్రీములు తెచ్చుకుని వాడుతుంటారు.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ స్క్ర‌బ్స్ ను ట్రై చేస్తే సులువుగా చ‌ర్మ ఛాయ‌ను పెంచుకోవ‌చ్చు.

మ‌రి ఆ స్క్ర‌బ్స్ ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.చ‌ర్మ ఛాయ‌ను పెంచ‌డంతో తుల‌సి ఆకులు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో తుల‌సి ఆకుల పొడి, శెన‌గ‌పిండి, చిటికెడు ప‌సుపు మ‌రియు పాలు వేసి కాస్త టైట్‌లో క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి అప్లై చేసి కాసేపు స్క్ర‌బ్ చేసుకోవాలి.డ్రై అయిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్‌ చేసుకోవాలి.

ఇలా వారంలో ఒక‌టి లేదా రెండు సార్లు చేస్తే చ‌ర్మ ఛాయ పెరుగుతుంది.

"""/" / అలాగే ఒక బౌల్‌లో బ్రౌన్ షుగ‌ర్, బాదం ఆయిల్ వేసి క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి అప్లై చేసి వేళ్ల‌తో మెల్ల మెల్లగా స్క్ర‌బ్ చేసుకోవాలి.

ఒక ప‌ది నిమిషాలు  ఆరిన త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా మూడు రోజుల‌కు ఒక‌సారి చేస్తే చ‌ర్మంపై పేరుకుపోయిన మృత‌క‌ణాలు పోయి కాంతివంతంగా మారుతుంది.

ఇక ఒక బౌల్ తీసుకుని అందులో ఓట్స్ పొడి, నిమ్మ ర‌సం మ‌రియు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి ప‌ట్టించి స్క్ర‌బ్ చేసుకోవాలి.అనంత‌రం కూల్ వాట‌ర్‌తో వాష్ చేసుకోవాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

చిన్నప్పుడే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను.. వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!