తెల్లగా మారడానికి క్రీములు వాడుతున్నారా.. అయితే మీరిది తెలుసుకోవాల్సిందే!

డస్కీ స్కిన్ టోన్( Dusky Skin Tone ) కలిగిన వారిలో చాలా మంది తెల్లగా మారేందుకు ఆరాటపడుతుంటారు.

ఈ క్రమంలోనే తమ చర్మాన్ని తెల్లగా మెరిపించుకోవడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీములను వేలకు వేలు పెట్టి కొనుగోలు చేసి వాడుతుంటారు.

అయితే వాటి వల్ల చర్మం ఎంత తెల్లగా మారుతుంది అన్నది పక్కన పెడితే.

ఆయా క్రీముల్లో ఉండే కెమికల్స్ వల్ల భవిష్యత్తులో అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి.

అందుకే సహజంగానే చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిపించుకునేందుకు ప్రయత్నించాలి.అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ అందుకు అద్భుతంగా సహాయపడుతుంది.

మరి ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక ఆరెంజ్ పండును( Orange Fruit ) తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి తొక్క తీయకుండానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే చిన్న అల్లం( Ginger ) ముక్కను పీల్ తొలగించి పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ పండు ముక్కలు మరియు అల్లం ముక్కతో పాటు నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్( Rose Water ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి( Sandalwood Powder ), వన్ టేబుల్ స్పూన్ రోజ్ పెటల్స్ పొడి, వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, చిటికెడు వైల్డ్ టర్మరిక్ పౌడర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు మ‌రియు చేతులకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

"""/" / ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేస్తూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

రోజుకు ఒకసారి ఈ విధంగా కనుక చేస్తే సహజంగానే చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.

చర్మంపై మొండి మొటిమలు మచ్చలు ఉంటే క్రమంగా తొలగిపోతాయి.స్కిన్ షైనీగా మెరుస్తుంది.

వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.కాబట్టి చర్మాన్ని తెల్లగా మెరిపించుకోవాలని భావించేవారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.

రిపబ్లికన్లకు మద్ధతు : రాబర్ట్ ఎఫ్ కెన్నెడీపై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు