ముఖంపై అవాంఛిత రోమాలా.. ఈ ఇంటి చిట్కాతో సహజంగానే తొలగించుకోండి!
TeluguStop.com
సాధారణంగా కొందరికి ముఖంపై అవాంఛిత రోమాలు( Unwanted Hair ) చాలా అధికంగా ఉంటాయి.
పెదవులపై, గడ్డం దగ్గర, చెంపలపై అవాంఛిత రోమాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి.హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలు.
ఏదేమైనా ఫేషియల్ హెయిర్ వల్ల మహిళలు ఎంతో ఇబ్బందికి గురవుతుంటారు.అసౌకర్యంగా ఫీల్ అవుతారు.
ఈ క్రమంలోనే ఫేషియల్ హెయిర్ రిమూవ్( Facial Hair Removal ) చేసుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.
అయితే షేవింగ్, వ్యాక్స్ వంటి పద్ధతులు కంటే ఇంటి చిట్కాలతో ముఖంపై ఏర్పడిన అవాంఛిత రోమాలను తొలగించుకోవడం ఎంతో ఉత్తమం.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కా అందుకు అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కప్పు పాలు పోసుకోవాలి.అలాగే అందులో వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు( Red Lentils ), వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి( Sandalwood Powder ) మరియు కొన్ని ఫ్రెష్ ఆరెంజ్ పండు తొక్కలు వేసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.
"""/" /
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న పదార్థాలు పాలతో సహా వేసుకుని స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై హెయిర్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
వారం రోజుల పాటు క్రమం తప్పకుండా ఆ సింపుల్ అండ్ పవర్ ఫుల్ హోమ్ రెమెడీని పాటిస్తే చర్మం పై ఏర్పడిన అవాంఛిత రోమాలు సహజంగానే తొలగిపోతాయి.
"""/" /
అలాగే చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవుతాయి.
చర్మం కాంతివంతంగా మారుతుంది.చర్మంపై అధిక ఆయిల్ ఉత్పత్తి సైతం తగ్గుతుంది.
కాబట్టి ఫేషియల్ హెయిర్ తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
వేణు స్వామికి మరోసారి నోటీసులు