అధికసార్లు మూత్రానికి వెళ్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకే!
TeluguStop.com
అధికసార్లు మూత్రానికి వెళ్లడంచాలా మందిలో ఉండే సమస్య ఇది.ప్రస్తుత చలి కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.
రోజుకు ఐదు నుంచి ఎనిమిది సార్లు మూత్రానికి వెళ్లడం సర్వ సాధారణ విషయం.
కానీ, కొందరు నీరు తాగకపోయినా అరగంట అరగంటకు మూత్రానికి వెళ్తుంటారు.దీనినే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అని అంటుంటారు.
తరచూ మూత్ర విసర్జన అనేది మధుమేహం ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చు.అలా అని మధుమేహం వల్లే ఈ సమస్య వస్తుంది అని అనుకుంటే పొరపాటే.
ఎందుకంటే, ఇతరితర కారణాల వల్ల కూడా అధికసార్లు మూత్రానికి వెళ్తుంటారు.ఇలాంటి వారు మూత్రాన్ని నియంత్రించుకోలేరు.
మరియు నానా ఇబ్బందులు కూడా పడుతుంటారు.అయితే కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే సులువుగా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
మరి ఆలస్యం చేయకుండా ఈ టిప్స్ ఏంటో చూసేయండి.అధిక మూత్ర విసర్జన సమస్య తగ్గాలంటే బ్లాడర్ ఆరోగ్యంగా ఉండాలి.
అయితే బ్లాడర్ ఆరోగ్యానికి మెరుగు పరచడంలో పెరుగు అద్భుతంగా సహాయపడుతుంది.కాబట్టి, ప్రతి రోజు ఒక కప్పుడు పెరుగు తీసుకుంటే మంచిది.
"""/"/
అలాగే అధికసార్లు మూత్ర విసర్జన సమస్యను నివారించడంలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండే ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా గ్రేట్‌గా సహాయపడుతుంది.
అందువల్ల, ప్రతి రోజు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు తేనె మిక్స్ సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇక చాలా మంతి మూత్రం అధిక సార్లు వస్తుందని నీరు తాగడం మానేస్తుంటారు.
కానీ, ఇలా చేయడం చాలా పొరపాటు.నీరు ఎక్కువగా తీసుకున్నప్పుడే ఏదైనా బ్యాక్టీరియా ఉండే యూరిన్ ద్వారా బయటకు పోయి అధికసార్లు మూత్రానికి వెళ్తే సమస్య తగ్గుముఖం పడుతుంది.
అదేవిధంగా, మద్యం అలవాటు ఉన్నా అధిక సార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది.కాబట్టి, మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
కెఫెయిన్ డ్రింక్స్, సిట్రస్ ఫ్రూట్స్, జ్యూసెస్, సోడా వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.
ఇక శరీరంలో కాల్షియం ఎక్కువైనా అధిక సార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది.కాబట్టి, శరీరానికి ఎంత కావాలో అంతే కాల్షియంను తీసుకోవాలి.
పిల్లి గీరడంతో మృతి చెందిన రష్యన్ వ్యక్తి.. షాక్‌లో ఫ్యామిలీ!