ముక్కు దిబ్బడతో ఇబ్బందిగా ఉందా.. అయితే ఈ పవర్ ఫుల్ చిట్కాలను ఫాలో అయితే సరి
TeluguStop.com
ముక్కు దిబ్బడ అనేది ముక్కు కుహరంలో వాపు మరియు బ్లాక్ కావటం వలన ఏర్పడుతుంది.
అలాగే ఫ్లూ, జలుబు మరియు ముక్కు ఇన్ఫెక్షన్ వలన కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది .
ఈ సమస్య ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగాను, చికాకుగాను ఉంటుంది.ఈ ముక్కు దిబ్బడ సమస్యను నివారించటానికి ప్రభావవంతమైన ఇంటి నివారణలు ఉన్నాయి.
ఈ ఇంటి నివారణలు సురక్షితమైనవి మరియు ఆరోగ్యానికి మంచివి.అంతేకాక ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.
ఈ ద్రావణాన్ని ముక్కు యొక్క ఒక బాగంలో డ్రాపర్ సాయంతో వేయాలి.ఈ విధంగా చేయటం వలన ముక్కు రద్దీని క్లియర్ చేయటానికి సహాయపడుతుంది.
అంతేకాక ముక్కు దిబ్బడకు కారణమైన ఇన్ఫెక్షన్ మరియు వాపును తగ్గించటంలో ఉప్పు నీరు బాగా సహాయపడుతుంది.
వెనిగర్ లో ఉండే ఆమ్ల స్వభావం సమస్య క్లియర్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది.
ఒక గ్లాస్ నీటిలో కొంచెం ఆపిల్ సైడర్ వినెగర్ వేసి కలిపి త్రాగితే మంచి పలితం కనపడుతుంది.
వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటివైరల్ లక్షణాలు ముక్కు దిబ్బడ చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
ముక్కులో ఇన్ఫెక్షన్ తొలగించి రద్దీని క్లియర్ చేయటానికి బాగా పనిచేస్తుంది .అందువల్ల వెల్లుల్లి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
కొన్ని తులసి ఆకులను నమలవచ్చు.లేకపోతే తులసి ఆకుల నుండి రసాన్ని తీసి త్రాగవచ్చు.
ఇది నాసికా మార్గంను శుభ్రం చేసి ముక్కు దిబ్బడ నుండి ఉపశమనాన్ని కలిగించటంలో చాలా బాగా
సహాయపడుతుంది.
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనే కలిపి త్రాగితే వెంటనే మంచి ఉపశమనం కలుగుతుంది.
హాలీవుడ్ డైరెక్టర్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. బాక్సాఫీస్ షేక్ కానుందా?