మీ వంటింట్లోనే ఎన్ని రకాల పెయిన్ కిల్లర్స్ ఉన్నాయో చూశారా?
TeluguStop.com
నేటి కాలంలో ఏ చిన్న నొప్పి వచ్చినా.వెంటనే పెయిన్ కిల్లర్స్‌ను వేసేసుకుంటారు.
తలనొప్పి, పంటి నొప్పి, చెవి నొప్పి, కాలు నొప్పి, నడుము నొప్పి ఇలా ఏ నొప్పి వచ్చినా లేట్ చేయకుండా టక్కున మెడికల్ షాప్‌కి వెళ్లి పెయిన్ కిల్లర్స్ కొనుగోలు చేసి వేసుకుంటారు.
ఇలా పెయిన్ కిల్లర్స్ క్రమంగా వాడటం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ముఖ్యంగా నొప్పి నివారణ ముందులు అతిగా వాడటం వల్ల లివర్, గుండె, కిడ్నీలు చెడిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటాయి.
కానీ, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.మన వంటింట్లోనే ఎన్నో పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి.
అవును, వంటింట్లోనే ఉండే కొన్ని కొన్ని ఆహారపదార్థాలు న్యాచురల్ పెయిన్‌కిల్లర్స్‌గా ఉపయోగపడతాయి.మరి అవేంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
లవంగాలు.పంటి నొప్పిని నివారించడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.
లవంగం తీసుకుని.పంటి నొప్పి ఉన్న చోట పెట్టుకుంటే క్షణాల్లోనే ఉపశమనం లభిస్తుంది.
కడుపు నొప్పి, ఛాతీ నొప్పి, గ్యాస్ నొప్పి, నెలసరి నొప్పి వంటి వాటిని నివారించడంలో అల్లం అద్భుతంగా సహాయపడుతుంది.
ఒక గ్లాస్ వాటర్‌లో అల్లాన్ని క్రాష్ చేసి.మరిగించి వడగట్టుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
జాయింట్ పెయిన్స్‌కు చెక్ పెట్టడంలో వెల్లుల్లి సూపర్‌గా ఉపయోగపడుతుంది.కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని అందులో రెండు వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి.
వేడి చేయాలి.అనంతరం ఆ నూనెను గోరు వెచ్చగా అయిన తర్వాత నొప్పి ఉన్న చోట పెడితే త్వరగా తగ్గిపోతుంది.
తలనొప్పి, నరాల నొప్పి వంటి వాటిని తగ్గించడంలో పుదీనా సహాయపడుతుంది.కొన్ని పుదీనా ఆకులను వాటర్‌లో వేసి మరిగించి.
గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.ఇలా చేస్తే త్వరగా నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు.
పెద్ది సినిమాకి రెహమాన్ కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుండేదా..?