ఈ వంటింటి మాయిశ్చరైజ‌ర్ల‌ను ఎప్పుడైనా వాడారా?

ప్ర‌స్తుతం చ‌లి కాలం ప్రారంభం అయింది.ఈ సీజ‌న్‌లో పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రి చ‌ర్మ‌మూ పొడి బారి పోతుంటుంది.

ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ఖ‌రీదైన మాయిశ్చ‌రైజ‌ర్ల‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.

కానీ, చ‌ర్మాన్ని తేమ‌గా మార్చుకునేందుకు వంటింట్లోనే ఎన్నో మాయిశ్చ‌రైజ‌ర్లు ఉన్నాయి.మ‌రి ఆ మాయిశ్చ‌రైజ‌ర్లు ఏంటీ.

? వాటిని ఎలా వాడాలి.? వంటి విష‌యాల‌ను ఏ మాత్రం లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / షియా బటర్‌ చ‌ర్మాన్ని తేమ‌గా, మృదువుగా మార్చ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

షియా బటర్ చిటికెడు క‌స్తూరి ప‌సుపు మ‌రియు కొద్దిగా నిమ్మ ర‌సం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని బాడీ మొత్తానికి ప‌ట్టించి.అర గంట అనంత‌రం స్నానం చేయాలి.

ఇలా చేస్తే చ‌ర్మం పొడి బార‌కుండా ఉంటుంది.అలాగే ఒక బౌల్‌లో రోజ్ వాట‌ర్‌, కొబ్బ‌రి నూనెను స‌మానంగా తీసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని రోజూ రాత్రి నిద్రించే ముందు ముఖానికి, మెడకు మ‌రియు పెద‌వుల‌కు అప్లై చేసుకుని.

ఉద‌యాన్నే చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజూ చేస్తే చ‌ర్మం తేమ‌గా, కోమ‌లంగా ఉంటుంది.

పులియబెట్టిన మ‌జ్జిగ, పెరుగులో చ‌ర్మానికి తేమనందించే గుణాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి.అందుకే బాత్ చేసే అర గంట‌ ముందు చ‌ర్మానికి పులియబెట్టిన మ‌జ్జిగ లేదా పెరుగును రాసుకుంటే డ్రై స్కిన్ స‌మ‌స్యే ఉండ‌దు.

"""/" / విట‌మిన్ ఇ ఆయిల్ సైతం న్యాచుర‌ల్ మాయిశ్చ‌రైజ‌ర్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.విట‌మిన్ ఇ ఆయిల్‌కు కొద్దిగా తేనెను చేర్చి.

చ‌ర్మానికి అప్లై చేసుకోని బాగా ఆరిన త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

సౌత్ ఆఫ్రికన్ బిర్యానీ ఇండియన్ బిర్యానీ కంటే రుచిగా ఉంటుందా..?