డార్క్ స‌ర్కిల్స్‌కు ఈ సింపుల్ టిప్స్‌తో సులువుగా చెక్ పెట్టేయండి!

డార్క్ స‌ర్కిల్స్ (న‌ల్ల‌టి వ‌ల‌యాలు).ఈ స‌మ‌స్యతో చాలా మంది ఇబ్బంది ప‌డుతుంటారు.

కళ్ల కింద ఏర్ప‌డే ఈ డార్క్ స‌ర్కిల్స్ ను పోగొట్టుకునేందుకు మార్కెట్‌లో దొరికే ర‌క‌ర‌కాల ఉత్ప‌త్తుల‌ను వినియోగిస్తుంటారు.

ఈ క్ర‌మంలోనే వేల‌కు వేలు ఖ‌ర్చు చేస్తుంటారు.అయితే ఎంత ఖ‌ర్చు పెట్టినా స‌మ‌స్య త‌గ్గ‌క‌పోతే.

అప్పుడు వ‌చ్చే బాధ అంతా ఇంతా కాదు.అయితే డార్క్ స‌ర్కిల్స్ పోగొట్ట‌డం‌లో ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్‌ చిట్కాలు అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

"""/" / మ‌రి ఈ చిట్కాలు ఏంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందు ఒక బౌల్ తీసుకుని.అందులో కొద్దిగా రోజ్ వాట‌ర్ మ‌రియు న్యాచుర‌ల్ అలోవెర జెల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి.బాగా ఆరిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం వ‌ల్ల డార్క్ సర్కిల్స్ క్ర‌మంగా త‌గ్గిపోతాయి. """/" / అలాగే ఒక బౌల్‌లో ప‌చ్చి పాలు మ‌రియు చిటికెడు ప‌సుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని కళ్ల చుట్టూ అప్లే చేసి.ప‌ది నిమిషాలు లేదా ప‌దిహేను నిమిషాల పాటు ఆర‌నిచ్చి అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా వారినికి మూడు లేదా నాలుగు సార్లు చేస్తే.ఖ‌చ్చితంగా క‌ళ్ల కింద ఏర్ప‌డిన డార్క్ స‌ర్కిల్స్ త‌గ్గుతాయి.

"""/" / ఇక కొన్ని పుదీనా ఆకుల‌ను తీసుకుని బాగా పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.

ఇప్పుడు పుదీనా ర‌సంలో కొద్దిగా నిమ్మ‌ర‌సం వేసి బాగా క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని క‌ళ్ల చుట్టూ పూత‌లా వేసి.

ఇర‌వై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.అనంతరం గోరువెచ్చ‌ని నీటితో క‌ళ్ల‌ను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల కూడా క‌ళ్ల కింద ఉన్న డార్క్ స‌ర్కిల్స్ సులువుగా న‌యం అవుతాయి.

కూటమికి చిరు మద్దతు తెలపడానికి అదే కారణం.. పిఠాపురంలో పవన్ గెలుపు కష్టం: చిట్టిబాబు