రేపటి నుంచి తగ్గనున్న నేచురల్ గ్యాస్ ధరలు..!

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.నేచురల్ గ్యాస్ ధరలను నిర్ణయించే విధానాన్ని సర్కార్ సవరిచింది.

దీంతో వంట గదులకు సరఫరా చేసే పైప్‎డ్ నేచురల్ గ్యాస్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరలు సుమారు 11 శాతం వరకు తగ్గబోతున్నాయి.

ప్రధాని మోదీ నేతృత్వంలో నిర్వహించిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీని వలన లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు.ముఖ్యంగా పీఎన్జీ, సీఎన్జీలను ఉపయోగించే వారికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు.