ముడతల నివారణకు... ఫ్రూట్ మరియు వెజిటెబుల్ ప్యాక్స్

ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరు ముడతలతో ఇబ్బంది పడుతున్నారు.

ఈ సమస్య నివారణకు మనకు అందుబాటులో ఉండే పండ్లు మరియు కూరగాయలు చాలా బాగా సహాయపడతాయి.

వాటితో ప్యాక్స్ తయారుచేసుకొని ముడతలను నివారించవచ్చు.h3 Class=subheader-styleకుకుంబర్ టానిక్/h3p కీరదోస కాయను తురిమి రసం తీసుకోవాలి.

స్పూన్ కీరదోస రసంలో పావు స్పూన్ నిమ్మరసం, పావు స్పూన్ పన్నీరు కలిపి చర్మానికి పట్టించాలి.

ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి.h3 Class=subheader-styleక్లిన్సింగ్ లోషన్/h3p ఒక స్పూన్ పాలలో ఒక స్పూన్ కీరదోస రసం, పావు స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి,మెడకు రాసి కాటన్ తో శుభ్రంగా తుడిచేయాలి.

ఇది చర్మ రంద్రాలను శుభ్రపరుస్తుంది.h3 Class=subheader-styleక్యాబేజీ మాస్క్/h3p రెండు క్యాబేజి ఆకులను తురిమి లేదా గ్రైండ్ చేసి రసం తీసుకోవాలి.

ఈ రసంలో పావు స్పూన్ ఈస్ట్ లేదా పుల్లటి పెరుగు, ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి, మెడకు రాయాలి.

పావుగంట తర్వాత నీటితో ముంచిన కాటన్ బాల్ సాయంతో తుడవాలి.ఈ ప్యాక్ ముడతలను తగ్గించి చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది.

అమెరికాపై అభిమానం చాటుకున్న ఎన్ఆర్ఐ కుటుంబం .. భారత్‌లోని ఇంటిపై ‘‘ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ’’