ముడతలు తీవ్రంగా బాధపెడుతున్నాయా? అయితే ఈ క్రీమ్ మీకోసమే!
TeluguStop.com
వయసు పైబడే కొద్ది చర్మంపై ముడతలు పడటం సర్వ సాధారణం.కానీ, కొందరు యంగ్ ఏజ్‌లోనే ముడతల సమస్యను ఫేస్ చేస్తుంటారు.
ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కాలుష్యం, బరువు తగ్గడం లేదా పెరగడం, మద్యపానం, ధూమపానం వంటి రకరకాల కారణాల వల్ల చిన్న వయసులోనే ముఖంపై ముడతలు ఏర్పడుతుంటాయి.
దాంతో వాటిని తగ్గించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్‌ను యూజ్ చేస్తే గనుక చాలా అంటే చాలా సులభంగా ముడతలను వదిలించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్రీమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో.? ఓ చూపు చూసేయండి.
ముందుగా బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపుప్పు, ఒక కప్పు వాటర్ పోసి మూడు గంటల పాటు నాన బెట్టుకోవాలి.
ఆ తర్వాత వాటర్‌తో సహా ఎర్ర కందిపప్పును మిక్సీ జార్‌లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి.
ఈ పేస్ట్ నుంచి జ్యూస్‌ను మాత్రం సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు మరో గిన్నె తీసుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్, రెండు టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పు జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, వన్ విటమిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్ వేసుకుని ఐదారు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే క్రీమ్ సిద్ధమైనట్టే.
"""/" /
ఒక బాక్స్‌లో ఈ క్రీమ్‌ను నింపుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే పది నుంచి పదిహేను రోజుల పాటు వాడుకోవచ్చు.
రాత్రి నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేకప్ మొత్తాన్ని పూర్తిగా తొలగించి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఆ తర్వాత తయారు చేసుకున్న న్యాచురల్ క్రీమ్‌ను ముఖానికి అప్లై చేసి పడుకోవాలి.
ఉదయాన్నే నార్మల్ వాటర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే గనుక చర్మంపై ఏర్పడిన ముడతలు క్రమంగా తగ్గు ముఖం పట్టి ముఖం అందంగా, యవ్వనంగా మెరుస్తుంది.