మీది పొడి చర్మమా..అయితే ఈ న్యాచురల్ క్లెన్సర్లు వాడాల్సిందే!
TeluguStop.com
జిడ్డు చర్మ తత్వం కలవారికే అన్ని సమస్యలూ అని చాలా మంది భావిస్తుంటారు.
కానీ, పొడి చర్మం బాధితులు కూడా ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే పొడి చర్మానికి నివారించేందుకు ఖరీదైన లోషన్లు, మాయిశ్చరైజన్లు వాడుతుంటారు.
అయితే కొందరు ఎన్ని వాడినా.మళ్లీ కొద్ది సేపటికే చర్మం ఎండి పోయినట్టు అయిపోతుంటాయి.
అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్లెన్సర్లను వాడితే.చర్మాన్ని ఎక్కువ సమయం పాటు తేమగా, మృదువుగా ఉంచుకోవచ్చు.
మరి లేటెందుకు ఆ న్యాచురల్ క్లెన్సర్లు ఏంటో ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ విటమిన్ ఇ ఆయిల్, ఒక స్పూన్ తేనె మరియు రెండు స్పూన్ల పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉపయోగించి.ముఖాన్ని క్లెన్సింగ్ చేసుకోవాలి.
ఆపై చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే చర్మం ఎక్కువ సమయం పాటు తేమగా మరియు మృదువుగా ఉంటుంది.
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో నీరు తీసిన పెరుగు రెండు స్పూన్లు, స్వచ్ఛమైన తేనె ఒక స్పూన్ మరియు బాదం ఆయిల్ ఒక స్పూన్ వేసుకుని కలుపుకోవాలి.
"""/"/ ఆ తర్వాత ఈ మిశ్రమానికి ముఖానికి, మెడకు పట్టించి క్లెన్స్ చేసుకోవాలి.
పొడి చర్మ తత్వం కలవారు ఇలా రోజూ చేసినా చర్మం తేమగా, యవ్వనంగా మెరుస్తుంది.
ఇక మరో న్యాచురల్ క్లెన్సర్ ఏంటంటే.బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్, రెండు స్పూన్ల పాలు, ఒక స్పూన్ తేనె వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమంతో ముఖానికి అప్లై చేసి క్లెన్సింగ్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేసినా మంచి ఫలితం ఉంటుంది.