తెలుగోళ్ల పరువు రోడ్డుపై పెడతారా.. సంక్రాంతి సినిమాలపై నట్టి కుమార్ షాకింగ్ కామెంట్స్!

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సమస్య ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.ఎవరికి వారు తమ సినిమాకే థియేటర్లలో ఎక్కువ ప్రాధాన్యత ఉండాలని పట్టుబట్టుతుండటంతో ఏ సినిమాకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దొరకడం లేదు.

ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ థియేటర్ల సమస్య గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.

నిర్మాతలంతా ఒకే గూటి పక్షులు అని నట్టి కుమార్ అన్నారు.శతమానం భవతి సినిమా సమయంలో రూల్స్ పెట్టింది దిల్ రాజేనని ఆయన తెలిపారు.

చిరంజీవి, బాలయ్య సినిమాలకు ప్రాధాన్యతనివ్వని ఊర్లలో పండుగ లేనట్టేనని నట్టి కుమార్ తెలిపారు.

తమిళనాడులో విజయ్, అజిత్ సినిమాలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందని ఆయన వెల్లడించారు.సి.

కళ్యాణ్ గారు "తెలుగోళ్ల పరువు రోడ్డుపై పెట్టొద్దు" అని అన్నారని ఎగ్జిబిటర్లు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

"""/"/ ఎగ్జిబిటర్లు ఆ ఏరియా డిమాండ్ కు అనుగుణంగా సినిమాలను తీసుకుంటే బాగుంటుందని నట్టి కుమార్ ఆయన పేర్కొన్నారు.

చిరంజీవి, బాలయ్య సినిమాలు వేయకపోతే ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర కూర్చుంటారని నట్టి కుమార్ అన్నారు.

సురేష్ బాబు కమర్షియల్ గా ఆలోచనలు చేస్తారని ఈ నిర్మాత అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"""/"/ చిరంజీవి, బాలయ్య సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వారసుడు సినిమాను ప్రదర్శిస్తే అక్కడ చిరంజీవి, బాలయ్యలకు ఫ్యాన్స్ లేరా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతాయని నట్టి కుమార్ తెలిపారు.

వారసుడు సినిమాను బ్యాలెన్స్ థియేటర్లలో వేస్తే బాగుంటుందని నిర్మాత నట్టి కుమార్ వెల్లడించడం గమనార్హం.

2023 సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న సినిమాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి కళ్లు చెదిరే కలెక్షన్లను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కంగువా కోసం సూర్య చేసిన త్యాగాలు వృథా.. తప్పంతా దర్శకుడిదేనా?