పవన్ ను అవమానించి చివరకు కాళ్లు పట్టుకున్నావు.. వర్మపై నట్టి సంచలన వ్యాఖ్యలు!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ డైరెక్టర్లలో రామ్ గోపాల్ వర్మ ఒకరు.నట్టి కుమార్ తాజాగా ఆర్జీవీ తెరకెక్కించిన మా ఇష్టం సినిమాపై సివిల్ కోర్టులో కేసు వేయడంతో ఆ సినిమా వాయిదా పడిందనే సంగతి తెలిసిందే.
మా ఇష్టం సినిమాను ప్రదర్శించబోమని పీవీఆర్ ఐనాక్స్ ఇప్పటికే వెల్లడించాయి.మా ఇష్టం రాబోయే రోజుల్లో ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే నట్టి కుమార్ దాఖలు చేసిన కేసు గురించి ఆర్జీవీ మాట్లాడుతూ నట్టి కుమార్ పై సంచలన ఆరోపణలు చేశారు.
నట్టికుమార్ తాజాగా మాట్లాడుతూ వర్మ ఒకప్పుడు గొప్ప దర్శకుడని ప్రస్తుతం అందరినీ చీట్ చేస్తున్నాడని వెల్లడించారు.
వర్మ తమకు కూడా డబ్బులు ఇవ్వాలని చాలామంది ఫోన్ చేస్తున్నారని నట్టి కుమార్ వెల్లడించారు.
డబ్బులు అడిగితే వర్మ రోజుకొకరిని అడ్డుపెట్టుకుని తప్పించుకుంటున్నాడని ఆయన అన్నారు.కొన్నిరోజుల క్రితం వరకు ప్రసన్న కుమార్ ను ఇప్పుడు రామ సత్యనారాయణను వర్మ అడ్డుపెట్టుకున్నారని నట్టి కుమార్ అన్నారు.
"""/"/ డ్రైవర్ కు డబ్బులు ఇవ్వకపోవడంతో డ్రైవర్ వర్మను చితకబాదాడని ముంబైలో వర్మ ఆఫీస్ కు రెంట్ కట్టలేదని గోవాలో వర్మ అప్పు చేసి వచ్చాడని నట్టి కుమార్ అన్నారు.
అందరికీ వర్మ డబ్బులు ఇచ్చి మాట్లాడాలని నట్టి కుమార్ కామెంట్లు చేశారు. """/"/
పవన్ ను వర్మ అవమానించి చివరకు పవన్ కాళ్లు పట్టుకున్నాడని నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అందరినీ బెదిరించి వర్మ బ్రతుకుతున్నాడని నట్టి కుమార్ పేర్కొన్నారు.తాను కష్టపడి డబ్బు సంపాదించుకున్నానని నట్టి కుమార్ తెలిపారు.
వర్మ ఒకే సినిమాను ఇద్దరికి అమ్ముతున్నాడని నట్టి కుమార్ పేర్కొన్నారు.అందరి తరపున తాను డబ్బులు అడుగుతున్నానని నట్టి కుమార్ కామెంట్లు చేశారు.
ఈ కామెంట్లపై వర్మ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
బాలీవుడ్ వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా..?