మానసిక ఆరోగ్యంపై నాట్స్ అవగాహన సదస్సు

న్యూ జెర్సీ: సెప్టెంబర్ 27: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మానసిక ఆరోగ్యంపై ఆన్‌లైన్ వేదికగా నాట్స్ అవగాహన సదస్సు నిర్వహించింది.

మానసిక ఆందోళనను జయించడం ఎలా.? ఒత్తిడి ఎదుర్కొనే మార్గాలేమిటి.

? వ్యతిరేక ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి.? ఇలాంటి అంశాలపై మానసిక నిపుణులు, వైద్యులు ఈ సదస్సులో పాల్గొని మానసిక సమస్యలు, వాటి పరిష్కారాలపై వెబినార్‌లో పాల్గొన్న వారికి అవగాహన పెంచారు.

సెంచరీ పిడియాట్రిక్స్, ప్రెసిడెంట్ కృష్ణ మాదిరాజు, ఎ.ఎ.

పీ.ఐ ప్రెసిడెంట్ రవి కొల్లి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫెసిలిటేటర్ , టెక్సాస్ స్టేట్ కో ఆర్డినేటర్ ఉష పెర్రీ, ఇండో యూఎస్ రేర్ పేషంట్ అడ్వకేట్, నారా గోవింద్‌రాజన్‌లు ఈ అవగాహన సదస్సులో తమ అమూల్యమైన సూచనలు చేశారు.

లీడ్ హ్యుమానిటేరియన్ ఐటీ డైరెక్టర్ శ్రీ ఫణి ఈ సదస్పుకు వ్యాఖ్యతగా వ్యవహరించారు.

మానసిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన అంశం .దీనిపై అందరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి ఈ సదస్సులో చెప్పారు.

అందుకే మానసిక నిపుణులచే ఈ వెబినార్ నిర్వహించినట్టు ఆమె తెలిపారు.ఈ వెబినార్‌కు హాజరైన అతిథులకు, సభ్యులకు నాట్స్ ప్రెసిడెంట్ బాపు నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

యంగ్ హీరో విశాల్ రత్నం మూవీ సెన్సార్ రివ్యూ.. ఈ సినిమా టాక్ ఏంటంటే?