బోస్టన్ చాప్టర్ నూతన నాయకత్వాన్ని ప్రకటించిన నాట్స్ ప్రెసిడెంట్

బోస్టన్: డిసెంబర్ 10: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.

తాజాగా బోస్టన్ చాప్టర్ కమిటీని ప్రకటించింది.భాషే రమ్యం.

సేవే గమ్యం అనే నినాదానికి తగ్గట్టుగా నాట్స్ ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది.

ఈ క్రమంలో బోస్టన్ చాప్టర్ నాట్స్ సేవా సైనికులను ముందుండి నడిపించే నాయకత్వాన్ని గుర్తించిన నాట్స్ జాతీయ నాయకత్వం కొత్త కమిటీని ప్రకటించింది.

నాట్స్ బోస్టన్ చాప్టర్ కో ఆర్డినేటర్ శ్రీనివాస గొంది కి బాధ్యతలు అప్పగించింది.

అలాగే హెల్ఫ్ లైన్ కమిటీ ప్రతినిధి గా శ్రీనివాస్ గొంది, సహ సభ్యులుగా ప్రకాశ్ లక్కాల, సునీల్ కొల్లిలను ప్రకటించింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రతినిధి గా శ్రీథర్ గోరంట్ల, సహ సభ్యులుగా కల్యాణ్ కాకి, రాఘవ నన్నూరి లకు బాధ్యతలను కట్టబెట్టింది.

స్పోర్ట్స్ కమిటీ ప్రతినిధి గా సునీల్ కంభంపాటి, సహ సభ్యులు గా కల్యాణ్ కాకి, రాఘవ నన్నూరిలకు బాధ్యతలు అప్పగించింది.

కమ్యూనిటీ సర్వీసెస్ కమిటీ ప్రతినిధి గా సునీల్ కొల్లి, సహ సభ్యులుగా సునీల్ కంభంపాటి, రాజేష్ పాటిబండ్లను నియమించింది.

మెంబర్ షిప్ కమిటీకి రాఘవ నన్నూరికి ప్రతినిధి గా బాధ్యతలు అప్పగించింది.

సహ సభ్యులుగా గౌతమ్, కల్యాణ్ కాకి వ్యవహరిస్తారు.ఫండ్ రైజింగ్ కమిటీకి కల్యాణ్ కాకి ప్రతినిధి గా వ్యవహరించనున్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ సహ సభ్యులు గా ప్రసాద్ లక్కాల, శ్రీథర్ గోరంట్ల బాధ్యతలు తీసుకున్నారు.

యూత్ కమిటీ ప్రతినిధి గా రాజేశ్ పాటిబండ్ల, సహ సభ్యులుగా రాఘవ నన్నూరి, గౌతం చుండూరి వ్యవహరించనున్నారు.

వెబ్ అండ్ మీడియా కమిటీ ప్రతినిధి గా శ్రీనివాస గొంది, సహ సభ్యులుగా సునీల్ కంభంపాటి, శ్రీథర్ గోరంట్ల వ్యవహారిస్తారు.

నాట్స్ జాతీయ నాయకత్వం ప్రతిష్టాకత్మంగా చేపట్టిన మిలియన్ క్యాన్ ఫుడ్ డ్రైవ్ నాట్స్ బోస్టన్ చాప్టర్ ఉత్సాహంగా పాల్గొనడంపై నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస మంచికలపూడి అభినందనలు తెలిపారు.

నాట్స్ తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్ లో కూడా బోస్టన్ చురుకైన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

ఈ బాలుడు మృత్యుంజయుడా.. మూడో అంతస్తు నుంచి పడినా బతికే ఉన్నాడు.. వీడియో చూడండి!