చలపతిరావు మృతి పట్ల నాట్స్ సంతాపం
TeluguStop.com
ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతిని మరవకముందే.మరో సీనియర్ నటుడు చలపతిరావు మరణవార్తను తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
1200 పైగా తెలుగు చిత్రాల్లో నటించి ఏ పాత్ర వేసినా అందరి చేత శభాష్ అనిపించుకున్న చలపతిరావు మరణం తమను కలిచివేసిందని నాట్స్ ఛైర్ విమెన్ అరుణగంటి అన్నారు.
తెలుగు సినిమాల్లో విలనిజంతో పాటు కామెడీ పండించడంలో కూడా చలపతిరావుది విలక్షణమైన శైలి అని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి అన్నారు.
చలపతిరావు కుటుంబానికి నాట్స్ నాయకులు, సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కాలిమట్టికి ఉన్న విలువ ఇదే.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?