ఇండియా డే పరేడ్‌లో నాట్స్

న్యూయార్క్ వీధుల్లో హోరెత్తిన జై భారత్ నినాదాలుఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా న్యూయార్క్ నగరంలో జరిగిన 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నాట్స్ నాయకులు, సభ్యులు పాల్గొని జన్మభూమి పట్ల తమకు ప్రేమను చాటారు.

ఈ ఉత్సవాల సందర్భంగా ఎఫ్.ఐ.

ఏ ఏర్పాటు చేసిన ర్యాలీలో నాట్స్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇరు తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్న ఈ శకటం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ కార్యక్రమంలో నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి( బాపు) నూతి, డిప్యూటీ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డ్ సెక్రటరీ శ్యామ్ నాళం, ఇమ్మిడియట్ పాస్ట్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, పాస్ట్ ఛైర్మన్ శ్యామ్ మద్దాలి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్స్ రాజ్ అల్లాడ, శ్రీహరి మందాడి, చంద్రశేఖర్ కొణిదెల, ఆది గెల్లి, వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగతావుల, నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ గురు కిరణ్ దేసు, నాట్స్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ రామ్ కొమ్మనబోయిన, కిరణ్ తవ్వా తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ నాయకుల తో పాటు, స్థానిక తెలుగు సంస్థల సభ్యులు, డాన్స్ స్కూల్ పిల్లలు కూడా పాల్గొని ఈ ఉత్సవంలో ఆట, పాటలతో సందడి చేశారు.

ఈ కార్యక్రమం ఆ సాంతం భారత్ మాతా కీ – జై! వందేమాతరం! జై హింద్ వంటి నినాదాలతో న్యూయార్క్ నగరం హోరెత్తింది.

ECOGRA Certification: What It Means For Canadian Crypto Players And Withdrawal Limits In The True North