ఫ్లోరిడాలో టాయ్ డ్రైవ్‌ నిర్వహించిన నాట్స్

టాంపాబే: అమెరికా లో అనేక సేవ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరో వినూత్న సేవ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఫ్లోరిడాలోని టంపాబేలో నాట్స్ విభాగం టాయ్ డ్రైవ్ నిర్వహించింది.టంపాలోని హోప్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ హోమ్‌లో అనాథ చిన్నారులకు బొమ్మల విరాళంగా ఇచ్చేందుకు చేపట్టిన ఈ టాయ్ డ్రైవ్ విజయవంతంగా జరిగింది.

నాట్స్ సభ్యులు, తెలుగువారు చాలా మంది బొమ్మలను విరాళంగా ఇచ్చారు.ఇలా నాట్స్ సేకరించిన 1500 బొమ్మలను హోప్ చిల్డ్రన్ హోమ్‌కి విరాళంగా అందించడం జరిగింది.

నాట్స్ చేపట్టిన ఈ టాయ్ డ్రైవ్ కార్యక్రమం పట్ల హోప్ సంస్థ హర్షం వ్యక్తం చేసింది.

నాట్స్ సేవాభావంతో చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల ప్రశంసల వర్షం కుపించింది.చిన్నారుల్లో సృజనాత్మకత పెంచే పజిల్స్, బొమ్మలు, రిమోట్ కార్లు, సాప్ట్ టాయ్స్ ఇలా ఎన్నో రకాల బొమ్మలు టాయ్ డ్రైవ్‌లో నాట్స్ సేకరించడం ఇవ్వడాన్ని హోప్ సంస్థ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.

నాట్స్ సభ్యులతో పాటు వారి పిల్లలు కూడా ఇందులో భాగస్వాముల అయి టాయ్ డ్రైవ్‌ని విజయవంతం చేశారు.

చిన్నారుల్లో సేవాభావాన్ని పెంపొందించడానికి, సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే భావన పెంచడానికి ఈ టాయ్ డ్రైవ్ ఎంతగానో దోహద పడుతుందని హోప్ సంస్థ అభిప్రాయపడింది.

నాట్స్ చేపట్టిన టాయ్ డ్రైవ్ విజయవంతం చేయడానికి శ్రేయ మల్లాది, సృజన మాడభూషి, సుధాకర్ మున్నంగి, భరత్ ముద్దన, భాను ధూళిపాళ్ల తదితరులు కీలక పాత్ర పోషించారు.

ఈ టాయ్ డ్రైవ్ కోసం తమ వంతు సహకారాన్ని అందించిన నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా.

కొత్త శేఖరం, బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, బోర్డు ఆఫ్ డైరక్టర్ శ్రీనివాస్ మల్లాది తదితరులకు నాట్స్ టంపాబే విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

ఫైనాన్స్/మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్స్ నేషనల్ కోఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహ మండలి సభ్యులు ప్రసాద్ అరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కో ఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కోఆర్డినేటర్ విజయ్ కట్టా, కోఆర్డినేటర్ కమిటీ చైర్స్ భరత్ ముద్దన, హరి మండవతో పాటు నాట్స్ వాలంటీర్‌లందరూ చక్కటి ప్రణాళికతో టాయ్ డ్రైవ్‌ని విజయవంతం చేశారు.

భావితరంలో సేవాభావాన్ని నింపేందుకు టాయ్ డ్రైవ్ చేపట్టి విజయవంతం చేసిన టంపాబే నాట్స్ విభాగాన్ని నాట్స్ ఛైర్ విమెన్ అరుణగంటి ప్రత్యేకంగా అభినందించారు.

సేవే గమ్యం నినాదానికి తగ్గట్టుగా టంపాబే విభాగం టాయ్ డ్రైవ్‌ నిర్వహించిందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి టంపాబే నాయకులను ప్రశంసించారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన, సెక్రటరీ రంజిత్ చాగంటి, ఎగ్జిక్యూటివ్ మీడియా సెక్రటరీ మురళి మేడిచెర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

నాని సినిమాకు మెాహన్ బాబు ప్లస్ అవుతాడా? మైనస్ అవుతాడా..?