ఈ నెల 20 నుంచి నాట్స్ క్రికెట్ కప్ 20 ఇంజనీరింగ్ కాలేజీల మధ్య క్రికెట్ పోటీ

సెయింట్ లూయిస్: సెప్టెంబర్ 11: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.

తెలుగునాట కూడా సేవా కార్యక్రమాలతో పాటు యువతను క్రీడల దిశగా ప్రోత్సాహించేందుకు తనవంతు సహకారం అందిస్తోంది.

ఈ నెల 20వ తేదీ నుంచి 27 వరకు నాట్స్ కప్ పేరుతో గుంటూరులో క్రికెట్ పోటీలు నిర్వహించనుంది.

"""/"/  ప్రాగ్మ ఎడ్జ్ సంస్థతో కలిసి గుంటూరు దగ్గర వింజనపాడులో ఉన్న కేకేఆర్ అండ్ కేఎస్టీ కాలేజీలో ఈ పోటీలు నిర్వహిస్తోంది.

విద్యార్ధుల్లో క్రీడా స్ఫూర్తిని నింపడమే లక్ష్యంగా ఈ నాట్స్ ఈ పోటీలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి అన్నారు.

ఈ పోటీల్లో విజేతలకు 10వేల రూపాయల నగదు బహుమతి, రన్నరప్ కు రూ.

7వేలు అందజేస్తామన్నారు.

వైరల్: వామ్మో.. ఈ మంచం ఏంటి ఇంత పెద్దగా ఉంది..