” నేషనల్ పాలిటిక్స్ “.. కే‌సి‌ఆర్ ను దెబ్బతీస్తున్నాయి ?

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు టి‌ఆర్‌ఎస్ పార్టీని బి‌ఆర్‌ఎస్( BRS Party ) గా మార్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్.

గతంలో తెలంగాణ వరకే పరిమితం అయిన ఆ పార్టీని ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నారు.

తెలంగాణ మోడల్ దేశంలో అమలు చేస్తామని, రైతు రాజ్యంగా దేశాన్ని తీర్చి దిద్దుతామని చెబుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు కే‌సి‌ఆర్.

కాగా బి‌ఆర్‌ఎస్ తో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత కే‌సి‌ఆర్( CM KCR ) దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు.

దానికి తోడు మోడీ సర్కార్ ను ఎండగడుతూ విపక్షాల దృష్టిని గట్టిగానే ఆకర్షించారు.

"""/" / దీంతో ఆయా రాష్ట్రాలలోని పలు పార్టీల నేతలు, రైతు సంఘాలు బి‌ఆర్‌ఎస్ కు పెద్ద ఎత్తున మద్దతు తెలిపాయి.

ముఖ్యంగా మహారాష్ట్ర( Maharashtra )లో బి‌ఆర్‌ఎస్ బలపడిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది.

మహారాష్ట్రలో చాలమంది నేతలు బీజేపీ గూటికి చేరారు.ఇక అదే విధంగా కర్నాటక, బిహార్, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కూడా బి‌ఆర్‌ఎస్ కొంత గట్టిగానే మద్దతు దక్కుతోంది.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ ప్రభావం ఎలా ఉండబోతుందనే చర్చ అందరిలోనూ మొదలైంది.

దాంతో పలు సర్వే సంస్థలు రంగంలోకి దిగి బి‌ఆర్‌ఎస్ పై ప్రజాభిప్రాయాలను తెలుసుకునేందుకు సిద్దమయ్యాయి.

ఎన్డీ టీవి, లోక్ నీతి, సెంటర్ ఫర్ ది స్టెడీ డెవలప్ మెంట్ వంటి సంస్థలు ఇప్పటికే సర్వే కూడా నిర్వహించినట్లు సమాచారం.

"""/" / అయితే ఈ సర్వేల ఆధారంగా వెలువడిన ఫలితాలు బి‌ఆర్‌ఎస్ కు గట్టి షాక్ అనే చెప్పాలి.

దేశంలో చాలా రాష్ట్రాలలోని ప్రజలకు అసలు బి‌ఆర్‌ఎస్ పార్టీ ఒకటి ఉందనే సంగతే తెలియదట.

70 శాతం ప్రజలకు బి‌ఆర్‌ఎస్ పార్టీ తెలియదని ఆ సర్వేలు చెబుతున్నాట్లు పోలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ సర్వేలు ఎంతవరకు నిజం అనే సంగతి తెలియదు గాని, ఒకవేళ నిజంగానే ప్రజలకు బి‌ఆర్‌ఎస్ పార్టీ గురించి తెలియకపోతే.

కే‌సి‌ఆర్ అంచనాలన్నీ తలకిందులయ్యే అవకాశం ఉంది.ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మోడీ సర్కార్( Narendra Modi ) ను గద్దె దించడమే లక్ష్యంగా కే‌సి‌ఆర్ ముందుకు సాగుతున్నారు.

ఈ నేపథ్యంలో అసలు బి‌ఆర్‌ఎస్ పార్టీ గురించి ప్రజలకు కొంతమేర కూడా అవగాహన లేకపోతే కే‌సి‌ఆర్ పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నిరవుతుందనేది కొందరి అభిప్రాయం.